Homeలైఫ్ స్టైల్Married 105 People : 105 మందితో పెళ్లి.. 14 దేశాలకు అల్లుడు.. చివరికి ఏమైందంటే..?

Married 105 People : 105 మందితో పెళ్లి.. 14 దేశాలకు అల్లుడు.. చివరికి ఏమైందంటే..?



Married 105 People :
పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. ఒక పెళ్లి చేయడానికి ముందు.. అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలంటారు. మారిన కాలంలో ప్రస్తుతం ఒక పెళ్లి చేయడమే గగనం అవుతుంది. అమ్మాయికి అబ్బాయి నచ్చాలి.. అబ్బాయికి అమ్మాయి నచ్చాలి.. ఇరు కుటుంబాలకు కట్న కానుకలు నచ్చాలి. ఇవన్నీ నచ్చి ఒక పెళ్లి చేయడం.. ఆయా కుటుంబాలకు చాలా కష్టమవుతోంది. అటువంటిది ఒక వ్యక్తి వందకు పైగా పెళ్లిళ్లు చేసుకొని ఔరా అనిపించాడు. ఎవరా వ్యక్తి ఏమిటా కథ చదివేయండి.


సిసిలీలోని సిరాకుసాకు చెందిన గియోవన్నీ విగ్లియోటో..

అమెరికాలోని సిసిలీలోని సిరాకుసాకు చెందిన గియోవన్నీ విగ్లియోటో వందకు పైగా వివాహాలను చేసుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సృష్టించాడు. 1929 ఏప్రిల్ 3న జన్మించిన ఆయన.. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులకు చిక్కి విచారణ సందర్భంగా ఈ వివరాలను వెల్లడించాడు. తన అసలు పేరు నీకోయ్ పెరుష్కో అని వెల్లడించాడు. అతని నిజమైన గుర్తింపు ఫ్రెడ్ జిప్ అని కూడా పేర్కొన్నాడు. అతను 1949 – 1981 మధ్య ఏకంగా 105 మంది మహిళలను వివాహం చేసుకున్నాడు. అతని భార్యలకు ఒకరి గురించి మరొకరికి తెలియకుండా జాగ్రత్త పడేవాడు. ఈ పరంపరలో అమెరికాలోని పలు రాష్ట్రాలతో పాటు 14 ఇతర దేశాల్లోని యువతులను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి జరిగిన ప్రతిసారి నకిలీ పత్రాలతో నకిలీ పేర్లతో యువతులతో పరిచయం పెంచుకునీ వివాహం చేసుకునేవాడు. దీంతో అమెరికాలోని అనేక రాష్ట్రాలకు, 14 దేశాలకు ఆయన అల్లుడు అయ్యాడు.

ముందు ప్రేమ ప్రతిపాదన తరువాత పెళ్లి..

ముందు అమ్మాయిలతో పరిచయం చేసుకుని వారిని మెల్లగా ముగ్గులోకి దింపేవాడు. కొద్ది రోజులకు వాళ్ళ ప్రేమ వ్యవహారం తారా స్థాయికి చేరిన తర్వాత పెళ్లి ప్రతిపాదన చేసేవాడు. పెళ్లి జరిగిన అనంతరం చాలా దూరంలో ఉద్యోగం చేస్తున్నానని.. ఉద్యోగ నిమిత్తం తప్పనిసరిగా వెళ్లాలంటూ భార్యకు చెందిన విలువైన వస్తువులు, ఆభరణాలు, డబ్బు తీసుకొని పరారయ్యేవాడు. ఇదే ట్రెండ్ జరిగినంతకాలం కొనసాగించాడు.

పోలీసుల చేతికి చిక్కడంతో అసలు విషయం వెలుగులోకి..

చివరికి వీగ్లియొట్టో 1981 డిసెంబర్ 28న పోలీసుల చేతికి చిక్కాడు. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతనిని పట్టుకొని విచారించగా మొత్తం వ్యవహారం బయటపడింది. రంగా 105 మందిని వివాహం చేసుకున్నట్లు ఆయన వెల్లడించాడు. ఈ కేసులో న్యాయస్థానం అతనికి 34 ఏళ్ల జైలు శిక్షతో పాటు 336 వేల డాలర్ల జరిమానా విధించింది. ఎన్నో పెళ్లిళ్లు చేసుకుని ఎంతో మంది అమ్మాయిలను మోసం చేసిన అతను 1991లో 61 ఏళ్ల వయసులో మెదడు రక్తశ్రావంతో మరణించాడు.

అందుకే ముందు వెనక ఆలోచించాలి..

ఇటువంటి వ్యక్తులు వల్లే పెళ్ళికి ముందు.. ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలని పెద్దలు చెబుతుంటారు. ఏమాత్రం ఆలోచించకుండా చేసే వివాహాలు వల్ల జీవితాలు నాశనం అవుతాయి. ఈ వ్యక్తి వల్ల సుమారు 105 మంది మహిళలు జీవితాలు నాశనం అయ్యాయి. బయటికి వచ్చిన ఇటువంటి వ్యక్తులు మాదిరి ఎంతోమంది చేస్తున్నారు. కాకపోతే అవి బయటకు రావడం లేదు.

RELATED ARTICLES

Most Popular