
Allu Arjun – NTR : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్న ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే.’దేశముదురు’ మూవీ స్పెషల్ షోస్ వేసుకొని ఫుల్ జోష్ లో ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ‘పుష్ఫ: ది రూల్’ టీజర్ మామూలు కిక్ ఇవ్వలేదు.ఇక సోషల్ మీడియా లో కూడా అల్లు అర్జున్ కి అభిమానులతో పాటుగా ఆయన తోటి నటీనటులు మరియు హీరోలు శుభాకాంక్షలు వెల్లువ కురిపించారు.
ఎంత మంది సెలెబ్రిటీలు విష్ చేసినా కూడా జూనియర్ ఎన్టీఆర్ విషెస్ చాలా స్పెషల్ గా అనిపించింది.పుట్టిన రోజు శుభాకాంక్షలు బావా అనగానే, అల్లు అర్జున్ థాంక్యూ భావ అని రిప్లై ఇవ్వడం, ఆ తర్వాత వెంటనే ఎన్టీఆర్ రిప్లై ఇస్తూ ‘పార్టీ లేదా పుష్ఫ’ అనడం,అప్పుడు అల్లు అర్జున్ వెంటనే ‘వస్తున్నా’ అంటూ రిప్లై ఇవ్వడం, ఈ క్యూట్ చాట్ నిన్న సోషల్ మీడియా ని ఊపేసింది.
ఇదంతా చూసిన ఫ్యాన్స్ పక్కనే ఇద్దరు కూర్చొని మందేస్తున్నారా అంటూ ఫన్నీ కామెంట్స్ చేసారు.ఒక అభిమాని దేశముదురు మరియు టెంపర్ మూవీ క్లిప్స్ ని క్లబ్ చేస్తూ పెట్టిన ఒక ఎడిట్ చాలా సరదాగా, ఫన్నీ గా అనిపించింది, ఆ ఎడిట్ ని ఈ ఆర్టికల్ చివర్లో మీరు కూడా చూసి ఎంజాయ్ చెయ్యండి.
ఎన్టీఆర్ బయట హీరోలతో మంచి స్నేహం గా ఉంటాడనే విషయం అందరికీ తెలిసిందే.ఇది ఓపెన్ సీక్రెట్, కానీ ట్విట్టర్ లో ఆయన హీరోలతో ఇలా సరదాగా మాట్లాడేది చూడడం ఇదే తోలిసారి.ఏది ఏమైనా తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వించదగ్గే ఈ స్టార్ హీరోల మధ్య ఇంత స్వచ్ఛమైన స్నేహం ఉండడం అనేది ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సూచిస్తుంది.స్టార్ హీరోలందరూ ఇంత క్లోజ్ గా ఉంటున్నారు కాబట్టి,హీరోల అభిమానులు కూడా అలాగే ఉంటె బాగుంటుందని అంటున్నారు విశ్లేషకులు.
Eyyyyyyy😂♥️pic.twitter.com/anGe159AMS
— Uday AAdhf (@UdayAAdhf) April 8, 2023