Markets: దేశంలో ఎన్నో మార్కెట్లు ఉన్నాయి. అయితే ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఆ మార్కెట్‌లో ధరలు ఉంటాయి. మానవుడికి కొన్ని వస్తువులు తప్పనిసరిగా అవసరం అవుతాయి. కొందరు వీటిని ఎక్కువ ఖర్చు పెట్టి కొంటారు. నిజం చెప్పాలంటే ధనికులు అసలు సాధారణ మార్కెట్‌లో కొనుగోలు చేయరు. ఎలాంటి వస్తువు కొనుగోలు చేసిన కూడా మాల్స్ లేదా పెద్ద షాప్‌లలో చేస్తారు. అదే సామాన్య ప్రజలు అయితే తక్కువ ఖర్చుతో అవుతుందని ఎక్కువగా మార్కెట్‌లోనే కొనుగోలు చేస్తుంటారు. అయితే దేశంలో చాలా మార్కెట్‌లు ఉన్నాయి. వీటిలో ఏ వస్తువు కొన్నా కూడా చాలా తక్కువ రేటుకే లభిస్తాయి. మీరు ఈ మార్కెట్లకు వెళ్తే.. ఏ వస్తువును అయిన చీప్ రేట్‌కే కొనుగోలు చేయవచ్చు. చాలా తక్కువ ధరకే అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీలోనే లభిస్తాయి. మరి దేశంలో ఉన్న ఆ మార్కెట్లు ఎక్కడ ఉన్నాయి? వీటిలో ఏ ఏ వస్తువులు తక్కువ ధరకు లభిస్తాయో తెలియాలంటే స్టోరీపై ఓ లుక్కేయండి.
సరోజినీ నగర్ మార్కెట్
ఢిల్లీలోని సరోజినీ నగర్‌లో ఉన్న మార్కెట్ చాలా ఫేమస్. చిరు వ్యాపారులు చాలా వస్తువులను ఇక్కడి నుంచి తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. ఈ మార్కెట్‌లో రూ.10 నుంచే వస్తువులు ప్రారంభం అవుతాయి. చెవి రింగులు, దుస్తులు, చెప్పులు ఇలా ఒకేటేంటి.. ఎన్నో రకాల వస్తువులు ఇక్కడ లభిస్తాయి. తక్కువ ధరలో వస్తువులు కొనాలంటే మాత్రం ఈ మార్కెట్‌కు వెళ్లాల్సిందే. ఇక్కడ దుస్తులు రూ.50కి కూడా నాణ్యమైన క్లాత్‌వి దొరుకుతాయి. అందులోనూ మీకు కావాల్సిన మోడల్స్‌లో లభిస్తాయి. మీరు ఇక్కడికి వెళ్తే ఇంత చీప్‌కే వస్తువులు లభిస్తాయా? అని పక్కా షాక్ అవుతారు.
కోలాబా కాజ్‌వే
ముంబాయిలో ఉన్న కొలాబా కాజ్‌వే మార్కెట్‌లో అన్ని దుస్తులు చౌకగా లభిస్తాయి. ఇక్కడ మీరు దుస్తులు, గృహ అలంకరణ వస్తువలు అన్ని కూడా కొనుగోలు చేయవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని రకాల వస్తువులు ఇక్కడ తక్కువ ధరకే లభిస్తాయి.
చాందినీ చౌక్
ఢిల్లీలో ఉన్న చాందినీ చౌక్‌లో దుస్తులు చాలా తక్కువ ధరకే లభిస్తాయి. ఇక్కడ సుగంధ ద్రవ్యాలు, ఎలక్ట్రానిక్ ఐటెమ్స్, దుస్తులు, మేకప్ వస్తువులు అన్ని కూడా లభ్యమవుతాయి.
లింకింగ్ రోడ్
ముంబైలోని బాంద్రా సమీపంలో లింకింగ్ రోడ్ మార్కెట్ ఉంది. ఈ మార్కెట్‌లో అన్ని వస్తువులు చాలా చౌకగా లభిస్తాయి. ఫ్యాషన్ బట్టలు, బూట్లు, మహిళలకు సంబంధించినవి అన్ని కూడా దొరుకుతాయి.
కమర్షియల్ స్ట్రీట్
బెంగళూరులో ఉండే కమర్షియల్ స్ట్రీట్ షాపింగ్‌లో తక్కువ ధరకే అన్ని వస్తువులను కొనుగోలు చేయవచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీలో గృహాలంకరణ వస్తువులు, దుస్తులు అన్ని కూడా కొనుగోలు చేయవచ్చు.
అర్పోరా మార్కెట్
గోవాలోని అర్పోరాలో ప్రతి శనివారం అర్పోరా మార్కెట్ జరుగుతుంది. ఇక్కడ బట్టలు, చేతితో తయారు చేసిన వస్తువులు, కళాకృతులు, గృహాలంకరణ వస్తువులు, సుగంధ ద్రవ్యాలు అన్ని కూడా చౌక ధరలకు లభిస్తాయి.