Central government : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇక పండుగ చేసుకోవచ్చు. ఎందుకంటారా? వీరు సంతోషపడేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది మోదీ సర్కార్. ఇందులో భాగంగానే ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 50 శాతం నుంచి 3 శాతం పెరిగింది. ఇది కాస్త 50 నుంచి 53 శాతానికి చేరి వారిని సంతోషపెట్టింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సంతోషకరమైన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇంతకీ ఆ తీపి కబురు ఏంటి అంటారా?
కోటి మంది కంటే ఎక్కువగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 50 శాతం డియర్‌నెస్ అలవెన్స్ పొందుతున్న విషయం తెలిసిందే. ఇకపై ఇది 53 శాతానికి మార్చాలి అని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL), ఎంటీఎన్ఎల్ (MTNL)లో పని చేస్తున్న ఉద్యోగులకు గ్రాట్యుటీ ను పెంచింది కేంద్ర ప్రభుత్వం.
ఈ కంపెనీల ఉద్యోగుల గ్రాట్యుటీని ఏకంగా ఐదు లక్షలు పెంచింది. అంటే రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు. సవరించిన ఈ కొత్త పరిమితి జనవరి 1, 2024 నుంచే అమలులోకి వస్తుంది. ఈ మార్గదేశాలను ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాదు నిబంధనల ప్రకారం డీఏ 50 శాతానికి చేరిన క్రమంలో ఇతర అన్ని అలవెన్సులను 25 శాతం మేర పెంచినట్లు తెలిపింది సెంట్రల్ సర్కార్.
అయితే ఇప్పుడు కేంద్ర కేబినేట్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులకు బేసిక్ పేలో డీఏ 53 శాతానికి పెరిగిందనే చెప్పాలి. ఈ పెంపు జూలై 1, 2024 నుంచి లెక్కలోకి వస్తుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల జీతాలు బాగా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు అధికారులు.
డీఏ 50 శాతం దాటినట్లయితే చాలా అలవెన్సులు కూడా పెంచాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని 7వ వేతన సంఘం సిఫార్సు చేస్తోంది. దీంతో దాదాపు 13 రకాల అలవెన్సుల్లో 25 శాతం పెరుగుదల కనిపించే అవకాశం ఉందట. జనవరి 1 నుంచే శాలరీలో ఈ మార్పులు వస్తాయని తెలుస్తోంది. ఇక పెరిగిన DA, DRతో కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం పొందే అవకాశం కూడా ఉంది. ఇక కేంద్రం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరో కొన్ని రోజుల్లో అంటే 2025 జనవరి నుంచి డియర్‌నెస్ అలవెన్స్‌లో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. అయితే ఈ సమాచారం AICPI ఇండెక్స్ డేటా ఆధారంగా క్లియర్ అవుతుంది. అంటే మొత్తం మీద ఉద్యోగులకు DA పెంపు దాదాపు 3 శాతంగా ఉండబోతున్నట్లు సమాచారం. ప్రస్తుత ట్రెండ్‌లు జనవరి 2025 నాటికి డియర్‌నెస్ అలవెన్స్ 56 శాతానికి చేరుకోవచ్చు కూడా.