Wash Room: పాములు అంటే భయపడని వారు ఎవరు అయినా ఉంటారా? పామును చూస్తే ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అవుతుంది. కలలో పాము కనిపించినా కూడా ఉలిక్కి పడి నిద్ర లేస్తారు. అయ్యో ఎందుకో పాము కలలో వచ్చిందే? ఏదైనా జరుగుతుందా? అని యూట్యూబ్ లో, గూగుల్ లో సెర్చ్ చేయడం మొదలు పెడతారు. అలాంటి పాము ఉదయం లేచి వెళ్లే బాత్ రూమ్ లోకి చొరబడితే.. వామ్మో ఇదేం ప్రశ్న.. అది పోవడం ఒకే మేము చూసుకోకుండా బాత్ రూమ్ లోకి వెళ్తే ఎలా అనుకుంటున్నారా? అయితే ఓ సారి ఈ వీడియోను చూసేయండి.
మహారాష్ట్రలో ఓ షాకింగ్ సంఘటన జరిగింది. అదేంటంటే ఓ యువకుడు తన ఇంట్లో బాత్ రూమ్ లో టాయిలెట్ కు వెళ్లాలి అనుకున్నాడు. కానీ సడన్ గా లోపల నుంచి బుసలు కొడుతున్న శబ్దం వినిపించే సరికి భయపడ్డాడు. కానీ ఈ శబ్దం ఎక్కడ నుంచి వస్తుందో అని పెద్దగా పట్టించుకోకుండా టాయిలెట్ లోకి వెళ్లాడు. కానీ శబ్దం మరింత పెద్దగా మారింది.
శబ్దం టాయిలెట్ నుంచే వస్తుందని గమనించి కాస్త చెక్ చేశాడు. అంతే లోపల నుంచి పెద్ద పెద్ద శబ్దాలతో బుస్ బుస్ అంటూ పాము కనిపించింది. 10 అడుగుల పాము బుసలు కొడుతూ పైకి రావడంతో ఒక్కసారిగా లేచి బయటకు పరుగులు అందుకున్నాడు. పాములు పట్టే వారికి కాల్ చేసి రప్పించాడు. దీంతో స్నేక్ స్నాచర్స్ వచ్చి పామును పట్టుకొని పోవడంతో సమస్య తీరిపోయింది. కానీ మీరు మాత్రం ప్రతి సారి వాష్ రూమ్ కి వెళ్లినప్పుడు చెక్ చేసుకోండి. సిటీ కదా మా వాష్ రూమ్ లో ఉంటాయి అనుకోకండి. ముందే ఎండ తీవ్రత చాలా ఉంది సో పాములు బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి జాగ్రత్త.