Nagabhushanam: సినిమాల్లో హీరోకి తగ్గట్టుగా విలన్ పాత్ర ఉండాలి. అలాంటప్పుడే సినిమా ఆధ్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఇక అప్పుడే సినిమా చూసే ప్రేక్షకులు కూడా ఆ సినిమాని చాలా ఆసక్తిగా చూడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అయితే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది విలన్లు వేరే భాషల నుంచి నటించి మంచి పేరు సంపాదించుకుంటున్నారు. కానీ ఒకప్పుడు ప్రతి నాయకుల పాత్రను పోషించి మెప్పించిన నటులు తెలుగులో చాలామంది ఉన్నారు. అందులో నాగభూషణం ఒకరు. ఇక ఈయన ఒక సినిమాలో ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తున్నాడు అంటే ఆ పాత్రలో చాలా వైవిధ్యమైనటువంటి నటన ను కనబరుస్తున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు.
ఎందుకంటే ఆయన జీవితంలో ఎన్నో రకాల విలన్ పాత్రలను పోషించి మెప్పించాడు. ఇక ఇది ఇలా ఉంటే 1922 వ సంవత్సరం మార్చి 29వ తేదీన అనకార్పుడి ప్రకాశం జిల్లాలో ఈయన జన్మించారు. ఆయన కెరియర్ లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న నాగభూషణం ఇంటర్మీడియట్ చదివిన తర్వాత సెంట్రల్ కమర్షియల్ సూపరెండెంట్ కార్యాలయంలో జాబ్ కూడా చేశాడు… ఇక ఆయన భార్య 1941 వ సంవత్సరంలో మరణించింది. అప్పుడు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్న నాగభూషణం ఆ తర్వాత శశిరేఖ అనే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు.
ఇక సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో నాగభూషణం అటు జాబ్ చేసుకుంటూనే ఇటు సినిమాల్లో ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాడు. ఇక అందులో భాగంగానే 1954 వ సంవత్సరంలో ఆయనకు ‘పల్లెటూరు ‘ అనే సినిమాలో నటించే అవకాశం అయితే వచ్చింది. ఇక దాంతో ఆయన తన ప్రతిభను చూపించుకొని ఆ సినిమాను సక్సెస్ చేసే దిశగా ముందుకు తీసుకెళ్లాడు. ఇక అప్పటినుంచి ఆయన వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో టాప్ విలన్ గా ఎదిగాడు.అమర సందేశం, పెంకి పెళ్ళాం, ఏది నిజం, మంచి మనుషులు అనే సినిమాలు ఆయనకు విలన్ గా మంచి గుర్తింపును తీసుకు వచ్చాయి…
మాయాబజార్, కురుక్షేత్రం లాంటి పౌరాణిక సినిమాల్లో కూడా తను నటించి మెప్పించడమే కాకుండా ఆయన పాత్రలకి ప్రాణం పోశారనే చెప్పాలి. ఇక అడవి రాముడు సినిమాలో ఆయన చేసిన ప్రతి నాయకుడి పాత్రను కాపీ చేస్తూ రావు గోపాల్ రావు విలన్ పాత్రలను పోషిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు…ఇక ఈయన సినీ కార్మికుల సంక్షేమ నిధి ని ఏర్పాటు చేశాడు. ఈయన చేసిన రక్త కన్నీరు నాటకం ద్వారా దాదాపు 25 సంవత్సరాల పాటు కళాకారుల ఆకలి తీర్చారు…
ఇక సినిమాల్లో విలన్ పాత్రను పోషించాడే తప్ప ఆయన నిజ జీవితంలో మాత్రం హీరో అనే చెప్పాలి… ఇక ఈయన ప్రొడ్యూసర్ గా మారి కొన్ని సినిమాలను కూడా నిర్మించడం విశేషం…ఇక 1995 మే 5 వ తేదీన ఆయన మరణించడం అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీ కి కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి… ఆయన మరణించి దాదాపు 29 సంవత్సరాలు అవుతుంది. ఇక ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ప్రతి సినిమా అభిమాని కూడా ఆయన గురించి గుర్తు చేసుకుంటున్నారు…