Face Pack: ఇంట్లోనే రాగిపిండితో ఫేస్ ప్యాక్ వేసుకోండి స్కిన్ సూపర్ గా అవుతుంది.

ఓ గిన్నె తీసుకోని అందులో 2 టేబుల్ స్పూన్ల రాగి పిండిని వేసుకోవాలి. తర్వాత అందులోనే పెరుగు వేసుకోవాలి.. దీంతోపాటు నిమ్మరసం, తేనె కూడా వేసుకోవాలి. అన్నీ వేసిన రాగి ఫేస్‌ప్యాక్‌ని బాగా కలపాలి.

Written By: Swathi Chilukuri, Updated On : September 6, 2024 5:05 pm

Face Pack

Follow us on

Face Pack: ఫేస్ అందంగా మారాలి అని ఎవరికి ఉండదు. కానీ ఈ బిజీ లైఫ్ లో ఫేస్ ను మెయింటెన్ చేయడం కూడా కష్టమే కదా. స్నానం తర్వా ఫౌడర్ వేసుకోవడానికి కూడా చాలా మందికి టైమ్ ఉండదు. అలాంటప్పుడు ఇక రెగ్యూలర్ మెయింటెన్ చేయడం కష్టమే కదా. కానీ రాగుల ఫేస్ ప్యాక్ అప్పుడప్పుడు వేసుకోండి మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఈ రాగులు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో చాలా పోషకాలు నిండి ఉంటాయి. పోషకాలతో నిండి ఉండే ఈ చిరుధాన్యం ఆరోగ్యానికి ఎన్నో రెట్ల మేలు చేస్తుంది. కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు స్కిన్‌‌కి కూడా మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనిని వాడడం వల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చు. రాగుల్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ లభిస్తాయి. ఇవన్నీ స్కిన్ గ్లోని పెంచడంలో మీకు సహాయం చేస్తాయి. మరి స్కిన్ గ్లో కోసం రాగి పిండిని ఎలా వాడాలో మీకు తెలుసా? అయితే ఓ సారి చదివేసేయండి.

కావాల్సినవి:
రాగి పిండి : 2 టేబుల్ స్పూన్లు, తేనె : 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం : 1 టీ స్పూన్, పెరుగు : 1 టేబుల్ స్పూన్

ఓ గిన్నె తీసుకోని అందులో 2 టేబుల్ స్పూన్ల రాగి పిండిని వేసుకోవాలి. తర్వాత అందులోనే పెరుగు వేసుకోవాలి.. దీంతోపాటు నిమ్మరసం, తేనె కూడా వేసుకోవాలి. అన్నీ వేసిన రాగి ఫేస్‌ప్యాక్‌ని బాగా కలపాలి. తర్వాత ఫేస్‌ని మంచిగా కడుక్కొని.. ముఖం ఆరిన తర్వాత ఈ ఫ్యాక్ ను ముఖానికి వేసుకోవాలి. మెడకి కూడా ఈ ప్యాక్ వేసుకోవాలి. కళ్ళ దగ్గర వేయకండి. ఎఫెక్ట్ అవుతాయి.. ఇలా వేసుకున్న ఫేస్‌ప్యాక్‌ని 15 నుంచి 20 నిమిషాల ఆరనివ్వండి. తర్వాత కొద్దిగా నీరు చల్లుతూ స్క్రబ్ చేస్తూ ఉండండి. దీనికోసం గోరువెచ్చని నీటిని వాడటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

ఫేస్‌ప్యాక్ క్లీన్ చేసుకున్న తర్వాత ముఖాన్ని తుడుచుకోవాలి. ఆ తర్వాత రెగ్యులర్‌గా వాడే మాయిశ్చరైజర్ రాసుకోండి. దీని వల్ల స్కిన్ హైడ్రేటై స్కిన్ కు గ్లో వస్తుంది. ఈ ప్యాక్ వేసుకునే ముందు ప్యాచ్ టెస్ట్ వేసుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. ఎందుకంటే కొంతమందికి రాగిపిండి పడదు. అలాంటి వారు ముందే టెస్ట్ చేసుకోవాలి. ఇందులో వాడే పదార్థాలు మీకు నచ్చినట్టుగా మీ స్కిన్ టైప్‌ని బట్టి చేంజ్ కూడా చేసుకోవచ్చు. మీది డ్రై స్కిన్ అయితే తేనె ఎక్కువగా కలపుకోండి. ఇక ఈ ప్యాక్‌ని వారానికి ఒకటి లేదా రెండు సార్లు వేసుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తాయి.

ఈ రాగి ఫేస్‌ప్యాక్ వేసుకోవడం వల్ల స్కిన్ ఎక్స్‌ఫోలియేటై అందంగా మారుతుంది. దీంతో స్కిన్‌పై ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ క్లియర్ చేయడంలో సహాయం చేస్తాయి. పోర్స్ కూడా క్లీన్ అవుతుంది అంటున్నారు నిపుణులు. ఇక ఈ ఫేస్‌ప్యాక్‌లో తేనె, పెరుగు కలిపుతారు కాబట్టి స్కిన్ హైడ్రేట్‌గా, సాఫ్ట్‌గా అవుతుంది. ఇక ఇందులో నిమ్మరసం కలిపుతారు కాబట్టి స్కిన్‌పై ఉన్న మచ్చలు తగ్గి స్కిన్ మెరిచేలా చేస్తుంది నిమ్మరసం.