https://oktelugu.com/

NTR: ఒకే ఒక్క ట్వీట్ తో గొడవలకు చెక్ పెట్టేసిన ఎన్టీఆర్..మోక్షజ్ఞ మొదటి చిత్రంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు!

బాబాయ్ - అబ్బాయి మధ్య గ్యాప్ ఏర్పడిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అయితే నేడు ఎన్టీఆర్ వేసిన ఒకే ఒక్క ట్వీట్ తో నందమూరి కుటుంబం మొత్తం ఒక్కటే, మా మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేవు అనేది స్పష్టమైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే నేడు బాలయ్య బాబు కొడుకు నందమూరి మోక్షజ్ఞ తేజ మొదటి సినిమా ప్రారంభమైంది.

Written By:
  • Vicky
  • , Updated On : September 6, 2024 / 04:59 PM IST

    NTR

    Follow us on

    NTR: నందమూరి కుటుంబం లో అంతర్యుద్ధం జరుగుతుందని ఎప్పటి నుండో వినిపిస్తున్న మాట. ఎన్టీఆర్ కి బాలయ్య బాబు కి పడడం లేదని, ఈ రెండు కుటుంబాల మధ్య బాగా గ్యాప్ ఏర్పడిందని, తారకరత్న పెద్ద కర్మ సమయంలో బాలయ్య బాబు ఎన్టీఆర్ ని కళ్యాణ్ రామ్ ని అవమానించాడని, ఇలా పలు రకాల కథనాలు మీడియాలో ప్రచారం అయ్యాయి. అంతే కాదు, బాలయ్య బాబు అనేక సందర్భాలలో జూనియర్ ఎన్టీఆర్ పై నేరుగానే కౌంటర్లు విసిరిన సందర్భాలు ఉన్నాయి. ఎన్టీఆర్ టీడీపీ కి ప్రచారం చేస్తే ప్లస్ అవుతుందా అని ఒక ప్రముఖ మీడియా కి సంబంధించిన విలేఖరి బాలయ్య బాబు ని అడగగా, ప్లస్ అవ్వొచ్చు, మైనస్ అవ్వొచ్చు, ప్లస్ మైనస్ అవ్వొచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.

    అప్పటి నుండి బాబాయ్ – అబ్బాయి మధ్య గ్యాప్ ఏర్పడిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అయితే నేడు ఎన్టీఆర్ వేసిన ఒకే ఒక్క ట్వీట్ తో నందమూరి కుటుంబం మొత్తం ఒక్కటే, మా మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేవు అనేది స్పష్టమైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే నేడు బాలయ్య బాబు కొడుకు నందమూరి మోక్షజ్ఞ తేజ మొదటి సినిమా ప్రారంభమైంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కాసేపటి క్రితమే విడుదల చేసింది మూవీ టీం. స్టైలిష్ గా ఎంతో కూల్ గా కనిపిస్తున్న మోక్షజ్ఞ లుక్ కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘ సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నందుకు శుభాకాంక్షలు. తాత గారి ఆశీస్సులతో పాటు, అన్ని రకాల పాజిటివ్ ఎనర్జీలు నీ జీవితంలోని సరికొత్త అధ్యాయానికి ఆశీస్సులు అందచేస్తాయి. పుట్టిన రోజు శుభాకాంక్షలు మోక్షు’ అంటూ ఎన్టీఆర్ వేసిన ట్వీట్ తెగ వైరల్ గా మారింది. దీనికి మోక్షజ్ఞ సమాధానం చెప్తూ ‘థాంక్యూ తారక్ అన్నా..మీ నుండి ఆశీస్సులు లభించడం చాలా ఆనందం కలిగిస్తుంది. మీ అందరూ గర్వపడేలా రెట్టింపు కష్టపడుతాను’ అంటూ మోక్షజ్ఞ ఎన్టీఆర్ ట్వీట్ కి రిప్లై ఇచ్చాడు. అంతే కాదు మోక్షజ్ఞ ట్విట్టర్ లో మొట్టమొదట ట్వీట్ వేసింది కూడా ఎన్టీఆర్ కి రిప్లై ఇస్తూనే అవ్వడం గమనార్హం.

    దీనిని బట్టి అభిమానులు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, సొంత కుటుంబం లో ఉండే వాళ్ళ మధ్య అప్పుడప్పుడు కొన్ని మనస్పర్థలు రావడం సహజం, కానీ ఎప్పటికైనా వాళ్లంతా మళ్ళీ కలిసిపోవాల్సిందే, ఎందుకంటే వాళ్లంతా ఒకే కుటుంబం కాబట్టి. అభిమానులు ఇక నుండైనా సోషల్ మీడియా లో గ్రూపులుగా విడిపోయి తిట్టుకోవడం వంటివి చేయకుండా, ఇలా అందరూ కలిసి ఉండడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. మరి ఎన్టీఆర్ వేసిన ఈ ట్వీట్ తో నందమూరి అభిమానుల మధ్య ఏర్పడిన చీలిక పూడుతుందా లేదా అనేది చూడాలి.