https://oktelugu.com/

Ghee: అన్ని పదార్థాలు కల్తీ అవుతున్నాయి. మరి కల్తీ నెయ్యిని తెలుసుకోవడం ఎలా?

స్వచ్ఛమైన నెయ్యి మంచి వాసన వెదజల్లుతుంది. కల్తీ నెయ్యి ఎలాంటి వాసన ఉండదు గుర్తు పెట్టుకోండి. అంతేకాదు స్వచ్ఛమైన నెయ్యి తినడానికి కూడా మంచి రుచి ఉంటుందని గుర్తు పెట్టుకోండి. అయితే నెయ్యిపై కొద్దిగా ఉప్పు వేసుకోవాలి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 6, 2024 / 05:09 PM IST
    Ghee

    Ghee

    Follow us on

    Ghee: వేడి వేడి అన్నంలో నెయ్యి కలుపుకొని తింటే ఆ టేస్ట్ చెప్పడం కూడా కష్టమే. సూపర్ టేస్ట్ వస్తుంది కదా. వేడి వేడి అన్నం, కాస్త ఆవకాయ తొక్కు, కొంచెం నెయ్యి. అబ్బ ఆ టేస్ట్ గురించి చెబితేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా. చికెన్ కూడా తక్కువే ఈ టేస్ట్ ముందు. అయితే నెయ్యిని గతంలో చాలా మంది ఇంట్లోనే చేసుకునేవారు. కానీ, ప్రస్తుతం నెయ్యి మార్కెట్లో చేసింది తీసుకోవడమే చాలా మందికి అలవాటు అయింది. ఇంట్లో చేయడం చాలా తక్కువ. అయితే ఈ మార్కెట్ నెయ్యి ఎంతవరకు స్వచ్ఛమైనదో చెప్పడం కష్టమే కదా. అన్ని పదార్థాలు కల్తీ అవుతున్నాయి. అదే విధంగా నెయ్యి కూడా కల్తీ అవుతుంది. అందుకే నెయ్యిని స్వచ్చమైనదా.. కాదా తెలుసుకోవడానికి కొన్ని టిప్స్ ఫాలో అవడం వల్ల మంచి నెయ్యిని ఇంట్లోకి తెచ్చుకోవచ్చు. ఎలా గుర్తు పట్టాలి అంటే?

    స్వచ్ఛమైన నెయ్యి మంచి వాసన వెదజల్లుతుంది. కల్తీ నెయ్యి ఎలాంటి వాసన ఉండదు గుర్తు పెట్టుకోండి. అంతేకాదు స్వచ్ఛమైన నెయ్యి తినడానికి కూడా మంచి రుచి ఉంటుందని గుర్తు పెట్టుకోండి. అయితే నెయ్యిపై కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్వచ్ఛమైన నెయ్యి అయితే రంగు మారదు. కానీ, స్టార్చ్ కలిస్తే మాత్రం నెయ్యి నీలం రంగులోకి మారుతుంది అంటున్నారు నిపుణులు. మీ అరచేతిలో నెయ్యి వేసుకొని స్వచ్ఛమైన నెయ్యి అయితే క్రిందకి జారుతుంది.. అదే కల్తీ నెయ్యి అయితే, చేతిలో వేసుకున్నట్టే ఉంటుంది.

    ముందుగా నెయ్యిని వేడి చేసి.. దీనిని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. కాసేపటికి నెయ్యి ఓ లేయర్‌లా ఏర్పడిందంటే ఆ నెయ్యిలో వేరే నూనెలు కలిసాయి అని అర్థం. అంతేకాదు నీటిలో వేసి కూడా నెయ్యిని చెక్ చేయవచ్చు. ఓ గ్లాసు నీటిని తీసుకొని.. అందులో ఓ నెయ్యి చుక్క వేయాలి. అది స్వచ్ఛమైనది అయితే నీటిలో నెయ్యి తేలుతుందని అంటున్నారు నిపుణులు.

    మరో విధంగా కూడా టెస్ట్ చేసుకోండి. ముందుగా ఓ పాన్ తీసుకుని అందులో ఓ స్పూన్ నెయ్యి వేయండి. దీన్ని వేడి చేయండి. నెయ్యి స్వచ్చమైనది అయితే అది త్వరగా కరిగి డార్క్ బ్రౌన్ రంగులోకి వస్తుంది. కల్తీ నెయ్యి అయితే అది కరగడానికి చాలా టైమ్ పడుతుంది. అంతేకాదు ఆ నెయ్యి కొద్దిగా పసుపు రంగులోకి మారుతుంది కూడా.

    మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కల్తీ జరుగుతుందనేది తెలిసిందే. అందుకే నెయ్యిలో కూడా ఏవేవో ఆయిల్స్ కలిపి అమ్ముతుండటంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి నెయ్యిని అసలు తినవద్దు. తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. కడుపు నొప్పి, ఉబ్బరం లాంటివి కూడా వస్తాయి. అంతేకాదు బరువు కూడా పెరుగుతారు అంటున్నారు నిపుణులు. గుండె సమస్యలు వస్తాయట జాగ్రత్త. కాబట్టి, ఇలాంటి నెయ్యి తినడం కంటే తినకపోవడమే బెటర్.

    నెయ్యిలో శాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో లేకుంటే లేదా అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉంటే నెయ్యి తినవద్దు. సాధారణంగా అన్నంలో నెయ్యి యాడ్ చేసి తినడం వల్ల భోజనంలో కేలరీల సంఖ్య పెరుగుతుంది. అప్పుడు బరువు మరింత పెరుగుతారు.