Homeపండుగ వైభవంMahashivratri 2023: మహాశివరాత్రి: ఈ ఆలయం దర్శిస్తే 7 తరాల పాపమంతా పోతుందట..

Mahashivratri 2023: మహాశివరాత్రి: ఈ ఆలయం దర్శిస్తే 7 తరాల పాపమంతా పోతుందట..

Mahashivratri 2023
Mahashivratri 2023

Mahashivratri 2023: మహాశివరాత్రి ఈ నెల 18న వస్తోంది. దీంతో జాతర కోసం అన్ని దేవాలయాలు ముస్తాబవుతున్నాయి. ప్రతి ఏటా జరిగే శివరాత్రి పర్వదిన వేడుకలకు ఆలయాలు సిద్ధమవుతున్నాయి. పరమశివుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు కూడా రెడీగా ఉన్నారు. శివరాత్రి రోజు జాగరణ చేసి తమ ఇష్ట దైవాన్ని కొలుస్తారు. తాము కోరుకున్న కోరికలు తీర్చాలి అంటూ వేడుకుంటారు. ముక్కంటిని కొలిచి తమ బతుకు బాగుపడేలా చూడాలని కోరుకుంటారు. శివుడు ఎక్కడ లేడు. అంతటా ఉన్నాడు. సర్వాంతర్యామి శివుడు. అందుకే శంకరున్ని మనసారా కొలిచి తమ పూజలు ఫలించాలని మొక్కులు చెల్లిస్తుంటారు. పరమశివుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తజనం శివయ్య చెంతకు బయలుదేరతారు.

Also Read: Amla Juice Health Benefits: ఇది రోజుకో గ్లాస్ తాగితే కొవ్వు ఇట్టే కరిగిపోతుంది తెలుసా?

శివరాత్రి రోజు ఎవరికి దగ్గరలో ఉన్న దేవాలయాలకు వారు వెళ్తుంటారు. కానీ కొంత మంది మాత్రం శివుడి కోసం ఎంత దూరమైనా వెళతారు. మధ్య్రప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ కు 30 కిలోమీటర్ల దూరంలో కొలువైన త్రిశూల్ ఖేడ్ ఆలయం గురించి చాలా మందికి తెలియదు. అత్యంత దూరం అడవి మార్గం గుండా వెళ్లాలి. ఇక్కడకు వెళ్లడం కష్టంతో కూడుకున్న పనే. కానీ చాలా మంది వ్యయప్రయాసలకోర్చి మరీ వెళ్తుంటారు. అక్కడకు వెళ్లాక చూస్తే మనం పడ్డ కష్టం కూడా మరిచిపోతాం. అంతటి మహత్తర శక్తిగల ఆలయంగా దీనికి ప్రసిద్ధి.

ఇక్కడ శివరాత్రి రోజు పరమేశ్వరుడిని దర్శించుకున్న వారికి అటు ఏడు జన్మలు ఇటు ఏడు జన్మల పాపాలు హరించకుపోతాయని నమ్మకం. దీంతో శివరాత్రికి శివుడికి, త్రిశూలానికి అభిషేకం చేస్తే ఎంతో ఫలితం ఉంటుందని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. అందుకే శివరాత్రి రోజు ఇక్కడకు భక్తులు విశేషంగా వస్తారు. ఆలయ కథనం ప్రకారం దీనికి ఆ పేరు ఎలా వచ్చిందంటే పూర్వం అంధకాసురుడనే రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేశాడు. దీనికి శివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని అడిగితే తనకు అమరత్వం కావాలని అడుగుతాడు. దీనికి శివుడు సరే అనడంతో అతడి ఆగడాలు మితిమీరుతాయి.

Mahashivratri 2023
Mahashivratri 2023

అప్పుడు శివుడు అంధకాసురుడిని అంతమొందించాలని తన త్రిశూలాన్ని కోరతాడు. దానికి త్రిశూలం తాను వాడిని చంపితే తన శక్తులు అంతమవుతాయని కుదరదని చెబుతుంది. దానికి ఫర్వాలేదు నీవు అతడిని చంపాల్సిందేనని చెప్పడంతో అంధకాసురుడిని అంతమొందిస్తుంది. కానీ త్రిశూలం శక్తులు పోవడంతో శివుడు దాన్ని పట్టుకుని అన్ని ప్రాంతాలు తిరుగుతాడు. అప్పడు నర్మదా నదీ తీరంలో త్రిశూలాన్ని ఉంచడంతో తన శక్తులు తిరిగి పొందుతుంది అందుకే ఈ ప్రదేశానికి త్రిశూల ఖేడ్ అని పేరు పెట్టారని చెబుతుంటారు.

Also Read:Sreemukhi Instagram Photos: ప్యాంటు లేకుండా కెమెరా ముందు పచ్చి ఫోజులు… శ్రీముఖిని ఉతికారేస్తున్న నెటిజన్లు!
 

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version