Relationships : నేటి కాలంలో వివాహాలు చేసుకోవడం.. కొంతకాలానికి విడాకులు తీసుకోవడం పరిపాటిగా మారింది. సెలబ్రిటీలు మాత్రమే కాదు సామాన్యులలో కూడా ఇటువంటి పెడపోకడలు కనిపిస్తున్నాయి.. భార్యాభర్తలను కలపడానికి కోర్టులు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ భార్య భర్తలు బెట్టు వీడడం లేదు. పైగా పంతాలకు.. పట్టింపులకు పోయి మూడుముళ్ల బంధాన్ని తెంచేసుకుంటున్నారు.
ఇటీవల కాలంలో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య దేశంలో పెరిగిపోతోంది. సెలబ్రిటీల కంటే సామాన్యులే తమ వివాహాలను విచ్ఛిన్నం చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఆర్థిక స్థిరత్వం పెరగడం.. ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండడం.. స్నేహితులు.. ఇతర వ్యవహారాలు విడాకులకు దారితీస్తున్నాయి.. అయితే కలిసి ఉంచేందుకు కోర్టులు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ దంపతులు తమ పంతాన్ని విడనాడడం లేదు. పైగా రకరకాల ఆరోపణలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా రంకెలు వేస్తున్నారు. సోషల్ మీడియాలో పరస్పరం దూషించుకుంటున్నారు.. అందువల్లే వివాహ వ్యవస్థ నగుబాటుకు గురవుతోంది. అయితే రోజురోజుకు పరిస్థితి మరింత దిగజారడం విలువల పతనాన్ని సూచిస్తోంది.

విడాకులు తీసుకోవడానికి సిద్ధపడిన తన భార్యను ఒక వ్యక్తి మార్చేశాడు. కోర్టు ఆవరణలోనే అతడు ఈ ప్రయోగానికి తెర లేపాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. అయితే ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుంది.. ఆ వ్యక్తి ఎవరు.. ఆ వివరాలు ఎక్కడ.. అనేవి మాత్రం తెలియ రాలేదు. కాకపోతే ఈ సంఘటన మనదేశంలోనే జరిగింది. ఆ వీడియోలో కనిపిస్తున్న దృశ్యం ప్రకారం అది కోర్టు అని స్పష్టం అవుతుంది. కారణాలు తెలియదు గాని.. అతని భార్య విడాకులకు అప్లై చేసింది.. దీంతో అతని కూడా కోర్టు విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. కోర్టు విచారణకు హాజరైన తర్వాత.. న్యాయమూర్తి వారిద్దరికీ సమయం ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే తన భార్య మనసు మార్చడానికి అతడు ఒక పాటను అందుకున్నాడు. ఫేమస్ బాలీవుడ్ సాంగ్ పాడాడు. ఆ పాటలో గాఢత.. అతని గాత్ర మాధుర్యానికి ఆమె పడిపోయింది..
అప్పటిదాకా విడాకులు తీసుకోవాలి అనుకున్న ఆమె ఒక్కసారిగా మనసు మార్చుకుంది. తన భర్తతో కలిసి జీవించడానికి ముందుకు వచ్చింది. సంసారం అన్నాక ఏవేవో ఇబ్బందులు ఉంటాయని.. అసలు వాటిని ఇంత సీరియస్ గా తీసుకొని తను ఇక్కడ దాకా రావడం మంచి పరిణామం కాదని ఆమె పేర్కొంది. భర్తకు క్షమాపణలు చెప్పి.. కలిసి ఉందామని చెప్పింది. తను కోరుకున్నది కూడా ఇదే కావడంతో ఆ భర్త ఆమెను అత్యంత ప్రేమపూర్వకంగా స్వీకరించాడు. ఇకపై కలిసి ఉందామని.. కలహాలు లేకుండా కాపురం చేద్దామని అతడు ఆమెతో చెప్పాడు. దానికి ఆమె కూడా ఒప్పుకుంది. ఫలితంగా విడాకులు తీసుకుందామని కోర్టుకు వచ్చినవారు కలిసి పోయారు. అన్యోన్యంగా జీవిస్తామని ప్రతిజ్ఞ చేసుకున్నారు
ఈ వీడియో లో దృశ్యాలు ఎక్కడ చోటుచేసుకున్నాయో తెలియదు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో కూడా తెలియదు. కాకపోతే నేటి కాలపు భార్యాభర్తలు ఈ వీడియో కచ్చితంగా చూడాలి. ముఖ్యంగా విడాకులు తీసుకోవాలి అనుకునేవారు కచ్చితంగా వీక్షించాలి. ఎందుకంటే ఈ వీడియోలో బంధం బలం.. ఆలుమగల మధ్య సాంగత్యం.. వివాహం గొప్పతనం తెలుస్తున్నాయి. న్యాయమూర్తులు ఇవ్వలేని కౌన్సిలింగ్ ఇవి ఇస్తున్నాయి.
He saved money pic.twitter.com/EfBKuVpLCC
— desi mojito (@desimojito) July 15, 2025