Bigg Boss 9 Telugu : కోట్లాది మంది బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ 9(Bigg Boss 9 Telugu) సెప్టెంబర్ నెలలో ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా ఈసారి సామాన్యులకు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే అవకాశాన్ని అందించారు. అందుకు సంబంధించిన దరఖాస్తులను కూడా సామాన్యుల నుండి స్వీకరించారు. ఇంకా ఇంటర్వ్యూస్ జరగలేదు కానీ, సెలక్షన్ ప్రక్రియ మాత్రం చాలా కొత్తగా ఉండబోతుంది. చూసే ఆడియన్స్ కి ఇది కచ్చితంగా థ్రిల్లింగ్ అనుభూతి కలిగిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే ఈ సీజన్ కి కూడా నాగార్జున నే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రోమోలు కూడా వచ్చేసాయి. అయితే గత సీజన్ లో నాగార్జున(Akkineni Nagarjuna) హోస్టింగ్ విషయం లో తీవ్రమైన నెగటివిటీ ని ఎదురుకున్నాడు. ఈ ఫీడ్ బ్యాక్ ఆయన వరకు వెళ్లిందట.
ఆ ఫీడ్ బ్యాక్ కి తగ్గట్టుగానే తన హోస్టింగ్ పద్దతిని మార్చుకోవడానికి సిద్దమయ్యాడట. అంతకు ముందు సీజన్స్ నాగార్జున ఎపిసోడ్స్ ని చూసి హోస్టింగ్ చేసేవాడు. కానీ ఈ సీజన్ 8 లో మాత్రం ఆయన ఎపిసోడ్స్ చూడకుండా,టీం ఇచ్చిన స్క్రిప్ట్ ని బట్టి హోస్టింగ్ చేసాడని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. ఇకపోతే ఈ సీజన్ చాలా కొత్తగా ఉండబోతుందట. కంటెస్టెంట్స్ కి చాలా కఠినమైన రూల్స్ కూడా పెట్టబోతున్నారని టాక్. ఫుడ్ వేస్ట్ విషయం లో మొదటి నుండి బిగ్ బాస్ టీం చాలా కఠినంగా వ్యవహరిస్తూ వచ్చింది. ఈ సీజన్ లో మరింత కఠినంగా వ్యవహరించబోతుందట. ఎవరైనా ఆహారాన్ని అనవసరంగా వృధా చేస్తే డైరెక్ట్ గా నామినేషన్ చేస్తారని అంటున్నారు. అలా ఆ కారణం చేత మూడు సార్లు కంటే ఎక్కువగా నామినేట్ అయితే నేరుగా ఎలిమినేట్ చేస్తారని అంటున్నారు. అంతే కాదు ఇప్పటి వరకు రెడ్ కార్డ్స్ ని ఉపయోగించి గేమ్స్ ఆడలేదు.
ఈసారి బిగ్ బాస్ హౌస్ లో రెడ్ కార్డు కాన్సెప్ట్ ని కఠినంగా ఉపయోగించబోతున్నారట. గత సీజన్ లో అభయ్ అనే కంటెస్టెంట్ బిగ్ బాస్ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడడం చూసి నాగార్జున చాలా ఫైర్ అయ్యాడు. రెడ్ కార్డు చూపించి వెళ్ళిపోమని చెప్పాడు. కానీ కంటెస్టెంట్స్ అందరూ బ్రతిమిలాడడంతో నాగార్జున రెడ్ కార్డు ని ఉపయోగించలేదు. కానీ ఈసారి మాత్రం కచ్చితంగా ఉపయోగిస్తారట. మెంటల్ టార్చర్ చేసినా, బూతులు ఉపయోగించినా, హద్దులు దాటి ఫిజికల్ అయినా రెడ్ కార్డు ని చూపించి మొహమాటం లేకుండా బయటకు నెట్టేస్తారట. గత సీజన్ లో నిఖిల్, గౌతమ్ మధ్య జరిగిన గొడవలకు రెడ్ కార్డు ఇచ్చి పంపేయొచ్చు. ఈసారి అలాంటి గొడవలు జరిగితే రెడ్ కార్డుని ఉపయోగిస్తారట. ఇంకా ఇలాంటి రూల్స్ చాలానే ఉన్నాయని టాక్.