https://oktelugu.com/

Lord Shiva : శివుడి వద్ద త్రిశూలం ఎందుకు ఉంటుందంటే?

తెల్లటి కంటి గుడ్డుపై నల్లటి కనుపాప, ఎర్రటి చారలో లోపలి భాగంలో ఉంటాయి. ఈ మూడు గుణాల వల్ల మనుషులు తప్పుదారులు పడుతారు.

Written By:
  • Srinivas
  • , Updated On : January 25, 2024 / 03:28 PM IST

    Lord Shiva Trishulam Story

    Follow us on

    Lord Shiva :పరమ మంగళమైనది శివస్వరూపం. నిర్గుణ స్వరూపానికి, నిత్య సతనానికి నిర్వచనం ఆ భోళా శంకరుడు. శివతత్వాన్ని అర్థం చేసుకున్న వారి జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. శివుడిని పూజించిన వారికి కష్టాలు తొలిగిపోతాయి. ప్రతీ సోమవారి శివనామ స్మరణం చేయడం వల్ల దు:ఖాలు తొలగిపోతాయి. త్రిమూర్తుల్లో విష్ణు,బ్రహ్మ కంటే శివుడిది ప్రత్యేకం. ఎలాంటి ఆడంబరాలు లేకుండా కనిపించే కైలాసనాధుడు అనగానే పులిచర్మం, విబూది, మెడలో పాము, నెత్తిన గంగతో కనిపిస్తాడు. అలాగే త్రిశూల ఆయుధంతో కనిపిస్తాడు. శివుడి దగ్గర త్రిశూల ఆయుధం ఉంటుంది.కానీ శివుడి మిగతా ఆయుధాలను కాదని త్రిశూలంతోనే ఎందుకు కనిపిస్తాడు? అనే సందేహం వచ్చే ఉంటుంది. అందుకు కారణమేంటో చూద్దాం..

    మంచి, చెడు రెండూ శివుడి వద్దే ఉంటాయి. అయితే అవసరమైనప్పుడు వాటిని బయటపెడుతారని కొందరు అంటుంటారు. మనుషులు దేవుడి దయవల్లే జన్మించినా అతని గుణగణాల్లో ఎన్నో మార్పులు ఉంటాయి. కామం, క్రోధం వంటి గుణాలు పరిస్థితుల బట్టి వస్తాయి. ఇవి జీవితాన్ని నాశనం చేస్తాయి. అయినా కొందరికి ఇవి జీవితాంతం ఉండి వారిని తప్పుదారి పట్టిస్తాయి. కోరికలు పెరుగుతున్న కొద్ది చెడు గుణాలు పెరుగుతాయి. ఈ సమయంలో ధర్మం కోసం దేవుడు కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అప్పుడు కొన్ని ఆయుధాలను వాడాల్సి వస్తుంది.

    శివుడి చేతిలో త్రిశూలంకు మూడు కొనలు ఉంటాయి. ఇవి మూడు గుణాలను తెలియజేస్తుంది. ఇవి సతో, రజో, తమో. ఇవి మూడు రంగులను కలిగి ఉంటాయి. సతో అంటే తెలుపు, రజో అంటే ఎరుపు, తమో అంటే నలుపు. ఈ మూడు గుణాలు మన కంట్లోనే ఉంటాయి. తెల్లటి కంటి గుడ్డుపై నల్లటి కనుపాప, ఎర్రటి చారలో లోపలి భాగంలో ఉంటాయి. ఈ మూడు గుణాల వల్ల మనుషులు తప్పుదారులు పడుతారు. వీటి వల్ల ఇతరులకు హాని చేస్తారు. వీటిని పోగొట్టడానికి శివుడు తన త్రిశూలాన్ని వాడుతాడు.

    అయితే ఈ గుణాలను ఒకేసారి వధించడానికి త్రిశూలంను శివుడు ఉపయోగిస్తారు. ఈ త్రిశూలం అమ్మవారి వద్ద కూడా ఉంటుంది. చాలా మంది అమ్మవారిని వేడుకుంటారు. తాము చేసిన తప్పుల నుంచి క్షమించాలని, అందుకు శివుడి అనుగ్రహం కల్పించాలని వేడుకుంటారు. శివుడు తన త్రిశూలంతో మనుషుల్లో ఉండే ఈ గుణాలను పోగొట్టి వారి జీవితాలను మంచి దారితో నడిపిస్తాడు.