Homeజాతీయ వార్తలుCongress: కాంగ్రెస్‌కు మళ్లీ టెన్షన్‌.. సొంతంగా ఎదగలేక ఈ పనులు!

Congress: కాంగ్రెస్‌కు మళ్లీ టెన్షన్‌.. సొంతంగా ఎదగలేక ఈ పనులు!

Congress: ప్రజాస్వామ్యంలో పాలక పక్షంతోపాటు ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి. ప్రతిపక్షం బలహీనపడితే, పాలక పక్షానికి అహంకారం పెరుగుతుంది. ఏం చేసినా చెల్లుతుంది అనే ధోరణితో ప్రజాస్వామ్యం గాడి తప్పుతుంది. అది కాంగ్రెస్‌ అయినా, బీజేపీ అయినా అంతే. కానీ, దేశంలో ప్రస్తుతం ప్రతిపక్ష కాంగ్రెస్‌ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చేలా కనిపిస్తోంది. సొంతంగా బలం పెంచుకోవడంపై దృష్టిపెట్టని కాంగ్రెస్‌ పార్టీ ప్రాంతీయ పార్టీలను నమ్ముకుని వారికే అధికారం అప్పగిస్తోంది. ఇలా వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక బీజేపీ సొంతంగా ఎదుగుతూ తన వెంట వచ్చే పార్టీలకు మాత్రం పెత్తనం ఇవ్వడం లేదు. ఇదే కాంగ్రెస్, బీజేపీ కూటముల మధ్య ప్రస్తుతం ఉన్న తేడా.

సొంత బలం పెంచుకోకుండా..
కాంగ్రెస్‌ పార్టీ దాదాపు 30 ఏళ్లుగా బలహీన పడుతూనే వస్తోంది. 1889లో ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి 400కుపైగా లోక్‌సభ స్థానాలను గెలిచింది. ఆ తర్వాత ఎన్నడూ కాంగ్రెస్‌ ఆ మార్కును దాటలేదు. రాజీవ్‌ హత్య తర్వాత పీవీ నర్సింహారావు ప్రధాని అయ్యారు. ఆ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు 180 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇక పీవీ తర్వాత ఎన్నడూ ఆ స్థాయిలో సీట్లు గెలవడం లేదు. 275 మార్కును అందుకోవడం లేదు. పార్టీని సంస్థగతంగా, సిద్ధాంతపరంగా, ఎజెండా పరంగా బలోపేతం చేయకుండా, పొత్తులనే కాంగ్రెస్‌ నమ్ముకుంటోంది. సంకీర్ణంలో అధికారంలోకి రావాలని చూస్తోంది. కానీ, అదే ఆ పార్టీకి మైనస్‌గా మారుతోంది.

ఇండియా కూటమికి బీటలు..
ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీని గద్దె దించేందుకు ఏడాది కాలంగా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కూటమి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో యూపీఏ కూటమి పేరును కూడా ఇండియా గా మార్చాయి. మరోవైపు రాహుల్‌ భారత్‌ జోడోయాత్ర చేశారు. ప్రస్తుతం భారత్‌ న్యాయ్‌ యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రతో దక్షిణాదిన కర్ణాటక, తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ జాతీయస్థాయిలో మాత్రం అనుకున్నంత బలపడినట్లు కనిపించడం లేదు. ఇక కూటమి సమష్టిగా మోదీని ఎదుర్కొనేందుకు ప్రత్యేక ఎజెండా రూపొందించే పనిలో పడ్డాయి. ఈక్రమంలో మల్లికార్జున ఖర్గేను కన్వీనర్‌గా కూడా నియమించారు. అంతా సవ్యంగా జరుగుతుందనుకుంటున్న తరుణంలో కూటమి నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ బయటకు వచ్చింది. తర్వాత ఆమ్‌ ఆద్మీ కూడా ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. దీంతో ఏడాదికే ఇండియా కూటమికి బీటలు వచ్చాయి.

సొంతంగా ఎదిగి ఉంటే..
కాంగ్రెస్‌ సొంతంగా ఎదిగి ఉంటే ఆ పార్టీకి మిత్ర పక్షాలపై ఆధార పడాల్సిన అవసరం వచ్చేది కాదు. కానీ, 30 ఏళ్లుగా మిత్రమక్షాలను నమ్ముకోవడం, వారికి పెత్తనం ఇవ్వడం, వారి కింద పనిచేయడం, ప్రత్యేకమైన ఎజెండా లేకపోవడం కాంగ్రెస్‌ ఎదుగుదలకు అవరోధంగా మారాయి. మరో మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్‌ పరిస్థితి చూస్తుంటే అధికారంలోకి వచ్చే అవకాశం తక్కువే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version