Kurchi Thatha: కుర్చీ తాత అరెస్ట్ కు ఆ సెలబ్రెటీనే కారణమా?

రీసెంట్ గా వచ్చిన గుంటూరు కారం సినిమాలో కుర్చీ తాత డైలాగుతో ఒక పాటనే వచ్చిందంటే ఆయన క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇక స్టార్ హీరో మహేష్ బాబు సినిమాలో ఈ సాంగ్ రావడంతో కుర్చీ తాత రేంజ్ అమాంతం పెరిగిపోయింది.

Written By: Swathi, Updated On : January 25, 2024 2:49 pm
Follow us on

Kurchi Thatha: రాత్రికి రాత్రే స్టార్లు కావాలంటే చాలా కష్టం. కానీ ఒకసారి ఫేమస్ వచ్చిందంటే కొన్ని రోజులు ఆ ఫేమ్ కొనసాగుతుంది. కానీ దాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టమే. అయితే రీసెంట్ గా కుర్చీ తాత ఏ రేంజ్ లో ఫేమస్ అయ్యాడో తెలిసిందే. కాలా పాషా అంటే గుర్తు పట్టని ప్రేక్షకులు కుర్చీ తాత అంటే మాత్రం పక్కా గుర్తు పడుతారు. ఒక్క బూతు డైలాగుతో భారీగా ఫేమస్ అయ్యారు ఈ కుర్చీ తాత. ఈయన డైలాగుతో కొన్నిరోజులు సోషల్ మీడియా మొత్తం మారుమోగింది. ఎక్కడ చూసినా కూడా కుర్చీ తాత డైలాగే వినిపించింది.

రీసెంట్ గా వచ్చిన గుంటూరు కారం సినిమాలో కుర్చీ తాత డైలాగుతో ఒక పాటనే వచ్చిందంటే ఆయన క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇక స్టార్ హీరో మహేష్ బాబు సినిమాలో ఈ సాంగ్ రావడంతో కుర్చీ తాత రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే ఈ కాలా పాషాను పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది. అయితే కుర్చీ తాత నోటి వెంట వచ్చిన కుర్చీ మడత పెట్టి అనే బూతు మాటతోనే గుంటూరు కారం సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ ను సిద్దం చేశారు.

ఈ సాంగ్ కు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ అని తెలిసిందే. దీని కోసం వైజాగ్ సత్య అనే వ్యక్తి కుర్చీ తాతను తమన్ వద్దకు తీసుకెళ్లారట. ఈయన ఇచ్చిన ఫిర్యాదు వల్లనే కుర్చీతాతను అరెస్ట్ చేశారు పోలీసులు. గతంలో వైజాగ్ సత్య అనే వ్యక్తి ఉప్పల్ బాలుతో కలిసి టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా సెలబ్రెటీగా చలామణి అవుతున్నారు. ఈయనే స్వయంగా కుర్చీ తాతను తమన్ వద్దకు తీసుకెళ్లారట. ఇదిలా ఉంటే తమన్ వద్ద డబ్బులు తీసుకొని తాను కాజేసినట్టు.. కుర్చీ తాత ప్రచారం చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే ముందు వీరిద్దరు బాగానే ఉండేవారట. కానీ మహేష్ బాబును అడిగి ఇల్లు ఇప్పించమని కోరడంతో తన వల్ల కాదన్నారట వైజాగ్ సత్య. దీంతో ఎదురు తిరిగి ఇలా తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని తెలిపారు సత్య. ఈయన ఫిర్యాదు మేరకు కుర్చీ తాతను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.