Lord Shani : సూర్య కుమారుడు అయినా శని దేవుడు కర్మ ఫలదాతగా పేర్కొనబడతాడు. మనుషులు చేసే తప్పులకు శిక్షలు వేస్తూ వారిని సరైన మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో మనుషులు కొన్ని కష్టాలను ఎదుర్కొంటారు. అయితే తమకు కష్టం వస్తే శని దేవుడే అష్ట కష్టాలు సృష్టిస్తాడని అంటూ ఉంటారు. కానీ శని దేవుడు కష్టాలను మాత్రమే కాకుండా ఆ స్వామిని ప్రసన్నం చేసుకుంటే అన్ని శుభాలను కూడా ఇవ్వగలుగుతాడు. ప్రతి మంగళ, శనివారం రోజుల్లో శని దేవుడికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం పొందవచ్చు. అయితే ఈ రెండు రోజుల్లోనే కాకుండా కొన్ని ప్రత్యేక రోజుల్లో శని దేవుడి అనుగ్రహం పొందడం వల్ల జీవితంలో ఎన్నో కష్టాల నుంచే బయటపడవచ్చు అని పండితులు చెబుతున్నారు. వాటిలో అద్భుతమైన రోజు మే నెలలో రానుంది. ఈ రోజున కేవలం కొన్ని నిమిషాలు శని దేవుడికి పూజలు చేయడం వల్ల కొన్ని దోషాల నుంచి బయటపడవచ్చు అని అంటున్నారు. ఇంతకీ ఆ అద్భుతమైన రోజు ఏదంటే?
Also Read : అప్పటినుంచి ఈ నాలుగు గ్రహాలపై శనీశ్వరుడి అనుగ్రహం..
కొన్ని దేవుళ్ళు జన్మించిన రోజున వారికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల వారు భక్తులకు అనుగ్రహిస్తారు అని హిందూ పురాణం చెబుతూ ఉంటుంది. అలాగే శని దేవుడి జయంతి రోజున కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం సంపాదించుకోవచ్చు అని అంటున్నారు. పురాణాల ప్రకారం వైశాఖమాసంలోని అమావాస్య రోజున శని దేవుడు సూర్యదేవుని అనుగ్రహం వల్ల జన్మించాలని చెబుతారు. అందువల్ల ప్రతి ఏడాది వైశాఖమాసంలోని అమావాస్య రోజున శని దేవుడికి ప్రత్యేక పూజలు చేయాలని అంటున్నారు.
అయితే ఈ ఏడాది తిథి ప్రకారం కొన్ని నిమిషాలు మాత్రమే శనిదేవుడికి పూజలు చేసే అవకాశం లభించింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025 మే 27న శని జయంతిని నిర్వహించుకోనున్నారు. పంచాంగం ప్రకారం మే 26వ తేదీన మధ్యాహ్నం 12:11 గంటలకు ప్రారంభమై మే 27వ తేదీన ఉదయం 8:31 వరకు అమావాస్య తిథి ఉండనుంది. అయితే ఈ కాలంలో కేవలం ఉదయం 5:25 గంటల నుంచి 5:32 గంటల వరకు సర్వార్ధ సిద్ధియోగం ఏర్పడనుంది. ఈ సమయంలో శని దేవుడికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల జీవితంలో ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయని కొందరు చెబుతున్నారు.
అయితే ఈ సమయంలో కేవలం పూజలు మాత్రమే కాకుండా.. ఈరోజు మొత్తం శనిదేవుడి అనుగ్రహం పొందేందుకు ఉపవాసం ఉండాలని.. సమీప ఆలయాల్లో శని దేవుడిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేయాలని.. ఆలయాల్లోని రావి చెట్టు కింద దీపం ఉంచాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల అనేక అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని అంటున్నారు. అంతేకాకుండా ఈరోజు వృద్ధులకు, పేదలకు దానం చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహం పొందుతారని చెబుతున్నారు. మనుషులు చేసే ఎన్నో కర్మల నుంచి తప్పించుకునేందుకు శని దేవుడి అనుగ్రహం పొందేందుకు ఇది మంచి సమయమని కొందరు పండితులు పేర్కొంటున్నారు.
Also Read : ఈ మూడు రాశులపై శని దేవుడి దయ.. వీరు ఎప్పటికీ విజేతలు గానే ఉంటారు…