Liver Problems: కాలేయ సమస్యలకి చెక్ పెట్టాలంటే.. ఈ మొక్కతోనే సాధ్యం

ఈ రోజుల్లో కాలేయ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. దీని నుంచి విముక్తి చెందాలంటే మిల్క్ తిస్టిల్ అనే ఓ గడ్డి మొక్క బాగా ఉపయోగపడుతుంది. ఈ గడ్డి మొక్క ఔషధంగా పనిచేస్తుంది. దీంతో కాలేయ సమస్యలు రాకుండా దాని ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవచ్చు. ఎలాగో మరి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By: Kusuma Aggunna, Updated On : October 27, 2024 9:02 pm

Liver Problems

Follow us on

Liver Problems: మానవ శరీరంలో ప్రతి అవయవం కూడా ముఖ్యమైనదే. ఏ అవయవం అయిన కూడా కాస్త సమస్య వస్తే చాలు.. అనారోగ్య పాలవుతారు. సమస్య చిన్నగా ఉన్నప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరు అయితే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ కొందరు అసలు జాగ్రత్త లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ తినేస్తుంటారు. దీనివల్ల కాలేయం దెబ్బ తింటుంది. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కాలేయం ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమైనది. కానీ కొందరు ఈ రోజుల్లో కాలేయ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. దీని నుంచి విముక్తి చెందాలంటే మిల్క్ తిస్టిల్ అనే ఓ గడ్డి మొక్క బాగా ఉపయోగపడుతుంది. ఈ గడ్డి మొక్క ఔషధంగా పనిచేస్తుంది. దీంతో కాలేయ సమస్యలు రాకుండా దాని ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవచ్చు. ఎలాగో మరి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కాలేయం ప్రమాదానికి గురికాకుండా..
జీవనశైలిలో మార్పుల వల్ల కొందరు కాలేయ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి విముక్తి చెందడానికి మిల్క్ తిస్టిల్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే సిలిమరిన్ ఆల్కహాల్ కాలేయ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల కాలేయ అనారోగ్యానికి గురికాకుండా రక్షణ కల్పిస్తుంది. ఈ మిల్క్ తిస్టిల్‌తో టీ చేసి తాగితే కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కాలేయంలో మంటను తగ్గిస్తుంది
మిల్క్ తిస్టిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలేయంలో మంటను తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కొందరు ఎక్కువగా ఆల్కహాల్ తాగుతారు. దీనిల్ల ఆల్కహాల్ దెబ్బతింటుంది. దీని నుంచి ఈ మిల్క్ తిస్టిల్ కాపాడుతుంది. అలాగే హెపటైటిస్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ మొదలైన వాటి నుంచి కాలేయం దెబ్బతిన్న ప్రతి దాన్ని నుంచి కూడా ఈ మిల్క్ తిస్టిల్ బాగా ఉపయోగపడుతుంది.

కాలేయాన్ని ఆరోగ్యాన్ని మెరుగు పర్చడంలో..
దెబ్బతిన్న కాలేయాన్ని నయం చేసే శక్తి ఈ మిల్క్ తిస్టిల్‌కి ఉంటుంది. ఇందులో ఉండే సిలిమరిన్ కాలేయ కణాలలో ప్రోటీన్‌ను పెంచుతుంది. ఇది దెబ్బతిన్న కాలేయ కణాలను మెరుగుపరచడంతో పాటు కాలేయ పనితీరును పెంచుతుంది.

వ్యాధికారక ప్రమాదాల నుంచి..
ఫైబ్రోసిస్, సిర్రోసిస్ అనే వ్యాధికారక ప్రమాదాల నుంచి మిల్క్ తిస్టిల్ కాలేయానికి రక్షణ కల్పిస్తుంది. ఇది కాలేయంలో ఉండే కొల్లాజెన్‌ను తగ్గిస్తుంది. దీంతో ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది.

ఇన్సులిన్‌ను మెరుగుపరుస్తుంది
ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరచి షుగర్ స్థాయిలను మిల్క్ తిస్టిల్ తగ్గిస్తుంది. అలాగే జీవక్రియ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దీనివల్ల కాలేయ వ్యాధి ప్రమాదాలు రాకుండా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఈ మొక్క అందరికి దొరక్కపోవచ్చు. కొందరు దీన్ని ఇంట్లో నాటుతారు. దీనివల్ల రోజూ దీంతో టీ చేసి తాగడం వల్ల ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఈ గడ్డి మొక్కను ఇంట్లోనే నాటుకోవడం ఉత్తమం.

 

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.