https://oktelugu.com/

Life Style: ఈ గుణాలు ఉన్నవారిని అమ్మాయిలు అస్సలు విడిచిపెట్టరు..

కొంతమంది అబ్బాయిలు చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటారు. అయితే వారు అందంగా మాట్లాడే వారైతే అమ్మాయిలకు బాగా నచ్చుతారు. ముఖ్యంగా మృదువుగా మాట్లాడేవారితో అమ్మాయిలు ఎక్కువ సేపు ఉండాలని కోరుకుంటారు. వారితో కాలక్షేపం చేయడానికి రెడీ అవుతారు.

Written By:
  • Srinivas
  • , Updated On : April 22, 2024 / 08:44 AM IST

    Girsl Want Good Character Boy

    Follow us on

    Life Style:ప్రతి ఒక్కరి జీవితం ప్రధానంగా రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి పెళ్లికి ముందు.. పెళ్లయిన తరువాత.. పెళ్లికి ముందు అమ్మానాన్నల వద్ద ఉంటారు కాబట్టి ఎలా ఉన్నా ఒకే.. కానీ పెళ్లయిన తరువాత మాత్రం సొంతంగా జీవించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తనకు తోడుగా ఉన్న వ్యక్తిని కాపాడాల్సి ఉంటుంది. అయితే ఒక వ్యక్తికి జీవితాంతం తోడుగా ఉండేందుకు వచ్చే అమ్మాయి, తనతో జీవితాంతం కలిసుండే అబ్బాయి ఎలా ఉండాలో ముందే నిర్ణయించుకుంటుంది. అయితే అందరి అమ్మాయిల్లోనూ అబ్బాయిలో ఎలా ఉండాలో? ఎలాంటి లక్షణాలు ఉన్న వారిని ఇష్టపడుతారోననే కామన్ గా కొన్ని పాయింట్స్ చూస్తారు. ఆ లక్షణాలు ఉన్న వారిని అస్సలు విడిచిపెట్టరు. ఇంతకీ ఆ పాయింట్స్ ఏంటంటే?

    కొంతమంది అబ్బాయిలు చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటారు. అయితే వారు అందంగా మాట్లాడే వారైతే అమ్మాయిలకు బాగా నచ్చుతారు. ముఖ్యంగా మృదువుగా మాట్లాడేవారితో అమ్మాయిలు ఎక్కువ సేపు ఉండాలని కోరుకుంటారు. వారితో కాలక్షేపం చేయడానికి రెడీ అవుతారు.

    good character boy

    • ఒక అమ్మాయి ప్రేమలో పడిన అబ్బాయి.. ఆ అమ్మాయి వెంట తిరుగే వారంటే బాగా లైక్ చేస్తారట. సూటిగా చెప్పాలంటే తమ వెంట తిరిగే అబ్బాయిలను మరింత ఇష్టపడుతారట.
    • అందం ఉన్న వారికి మంచి గుణం ఉంటుందో లేదో తెలియదు. కానీ గుణం ఉన్న వారు అందంగా లేకపోయినా.. వారిని అమ్మాయిలు బాగా ఇష్టపడుతారు. తెలివితేటలు ప్రదర్శించేవారిని సొంతం చేసుకోవడానికి ఎంతకైనా తెగిస్తారట.
    • సాధారణంగా అమ్మాయిలే ఎక్కువగా అందంగా ఉంటారు. అబ్బాయిల సౌందర్యం తక్కువే. కానీ అలాంటి అపురూపమైన వ్యక్తి దొరిగితే మాత్రం అస్సలు వదులుకోరట.
    • అయితే 90 శాతం ఆడవారు మాత్రం అందకంటే ఎక్కువ వ్యక్తిత్వాన్ని చూస్తున్నారు. మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అందంగా లేకపోయినా పర్వాలేదని అనుకుంటున్నారు.
    • నిజాయితీగా ఉండే అబ్బాయిల తమకు దొరికితే అమ్మాయిలు లక్ గా భావిస్తారట. దీంతో వారితో జీవితాంతం ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతారట.