https://oktelugu.com/

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ మరో గబ్బర్ సింగ్ అవుతుందా..?

గబ్బర్ సింగ్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ సినిమా విజయం మీద ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే ఇక హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ఇద్దరికీ మంచి క్రేజ్ దక్కుతుందనే చెప్పాలి.

Written By: , Updated On : April 22, 2024 / 08:49 AM IST
Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh

Follow us on

Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా భారీ అంచనాలతో తెరకెక్కుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూట్ 40% అయితే కంప్లీట్ అయింది, ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల పరంగా బిజీ గా ఉండటంతో ఈ సినిమాను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మరో మూడు నెలల తర్వాత ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో చూపించినట్టుగానే ఇందులో కూడా మదర్ సెంటిమెంట్, అలాగే బ్రదర్స్ మధ్య సెంటిమెంట్ ను ప్రధానంగా చేస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరి గబ్బర్ సింగ్ లాగానే ఈ సినిమా అంత పెద్ద విజయాన్ని సాధిస్తుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ దమ్మెంటో చూపించింది. ఇక ఈ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ మరోసారి తన స్టామినా ఏంటో చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాని హరీష్ శంకర్ తన కెరియర్ లోనే ది బెస్ట్ సినిమా మలచాలనే ఉద్దేశ్యం తో సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

మరి గబ్బర్ సింగ్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ సినిమా విజయం మీద ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే ఇక హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ఇద్దరికీ మంచి క్రేజ్ దక్కుతుందనే చెప్పాలి. ఇక దాంతో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేసినప్పటికీ మధ్యలో కొన్ని సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు.

ఇక అత్తారింటికి దారేది తర్వాత అంతటి భారీ సక్సెస్ అయితే పవన్ కళ్యాణ్ కి దక్కలేదు. మరి ఈ సినిమాతో అంతటి భారీ సక్సెస్ కొడతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇది ఇలా ఉంటే హరీష్ శంకర్ కి కూడా గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ పడలేదు..