Life Lesson: మీ జీతం ఎంత అని అడిగితే ఏం చెప్పాలో తెలుసా?

జీతం ఎక్కువ అయితే ఎలాంటి చింత లేదు. మరి తక్కువ అయితే ఏమని చెప్పాలి. వారి నుంచి ఎలా తప్పించుకోవాలి అనేది తెలియక నీళ్లు మింగుతుంటారు చాలా మంది.

Written By: Swathi, Updated On : July 2, 2024 5:55 pm

Life Lesson

Follow us on

Life Lesson: బంధువులు, స్నేహితులు, తెలిసిన వారు ఎక్కడికి వెళ్లినా ముందుగా ఎదురయ్యే ప్రశ్న ఏంటి చాలా రోజులకు కనిపిస్తున్నావ్? ఏం చేస్తున్నావ్? చాలా బీజీనా? ఎంత సంపాదిస్తున్నావ్ ఏంటి? జీతం బాగానే ఉన్నట్టు ఉందే అని అన్ని ప్రశ్నలను ఒకటే ప్రశ్నగా అడుగుతారు. ఇక ఈ అన్నిప్రశ్నల్లోని కొందరి అంతరార్థం మాత్రం జీతం తెలుసుకోవడమే. సంపాదన, జీతం తెలుసుకోవడం చాలా ఆత్రుతగా ఉంటుంది. ఎక్కువ అయితే వామ్మో అనుకోవడం, తక్కువ అయితే అయ్యో అంతేనా అనడం నైజమే కొందరికి.

మరి జీతం ఎక్కువ అయితే ఎలాంటి చింత లేదు. మరి తక్కువ అయితే ఏమని చెప్పాలి. వారి నుంచి ఎలా తప్పించుకోవాలి అనేది తెలియక నీళ్లు మింగుతుంటారు చాలా మంది. ఈ డైలామాలో నుంచి బయటపడాలంటే ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వికాస్ దివ్యకీర్తి చెప్పిన సమాధానం తెలుసుకోవాల్సిందే. ఈయన మాజీ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఐఏఎస్ కు సిద్ధం అవుతున్న విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు.

12 th ఫెయిల్ సినిమాలో కూడా కనిపించారు ఈయన. అయితే జీతం ఎంత అనే ప్రశ్న ఎదురైతే ఎలాంటి సమాధానం చెప్పాలో ఆయన వివరించారు. బంధువులు ఎవరైనా “మీ జీతం ఎంత?” అని అడిగితే వారికి ఖచ్చితమైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కానీ మీ జీతం తక్కువ ఉంటే దాని గురించి వివరించి చెప్పడం అవసరం లేదని.. జీతం తక్కువగా ఉన్నప్పుడు సింపుల్ గా ప్యాకేజీ పూర్తిగా చెబితే సరిపోతుంది అంటున్నారు ఆయన. ఏడాదికి ఎంత వస్తుందనే విషయం చెప్పాలట. బోనస్ లు, ఇతర ప్రోత్సాహకాలు విడిగా ఇస్తున్నారని చెప్పి బంధువుల ముందు గౌరవం నిలబెట్టుకోవాలి అని అన్నారు.

ఇతరులు కూడా ఎవరైనా మీ జీతం ఎంత అని అడిగితే తక్కువ అని చెప్పడానికి సంకోచించాల్సిన అవసరం లేదట. కేవలం మీ జీతం కాస్త ఎక్కువ చెబితే సరిపోతుంది. వారు మీ జీతాన్ని తనిఖీ చేయరు కదా.. అలాంటప్పుడు ఎక్కువ చెబితే తప్పు ఎందుకు అవుతుంది అన్నారు ఆయన. అయితే కొందరు కావాలనే ఇతరులతో మిమ్మల్ని పోల్చడానికి జీతం గురించి అడుగుతుంటారని.. అలాంటి వారికి ఇలా ఎక్కువ జీతం చెప్పడమే కరెక్ట్ అన్నారు వికాస్ దివ్యకీర్తి.