https://oktelugu.com/

Hybrid Cars: ధర ఎక్కువైనా EVల కంటే హైబ్రిడ్ కార్లే కావాలట.. ఎందుకంటే?

Hybrid Cars: హైబ్రిడ్ కార్లు అంటే ఏంటో తెలుసుకుందాం.. ఒక వెహికల్ లో పెట్రోల్ తో పాటు డీజిల్ లేదా ఎలక్ట్రిక్ అనే రెండు ఇంజిన్లు కలిగిన దానిని హైబ్రిడ్ కారు అంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : July 2, 2024 / 04:34 PM IST

    Best Hybrid Cars

    Follow us on

    Hybrid Cars: దేశంలో కార్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. మార్కెట్లో వివిధ వేరియంట్ల కార్లు ఉన్నప్పటికీ ఇటీవల హైబ్రిడ్ కార్ల విక్రయాలు ఎక్కువగా జరిగినట్లు కొన్ని లెక్కలను బట్టి తెలుస్తోంది. సాధారణంగా హైబ్రిడ్ కార్ల ధరలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎలక్ట్రిక్ వాహనాల కంటే అధికంగా ఉంటాయి. అయినా హైబ్రిడ్ కార్ల కోసం ఎగబడుతున్నారు. అసలు హైబ్రిడ్ కార్లను ఎందుకు కొంటున్నారు? వీటి వల్ల వినియోగదారులకు వచ్చే ప్రయోజన ఏంటి? ఆ వివరాల్లోకి వెళితే..

    ముందుగా హైబ్రిడ్ కార్లు అంటే ఏంటో తెలుసుకుందాం.. ఒక వెహికల్ లో పెట్రోల్ తో పాటు డీజిల్ లేదా ఎలక్ట్రిక్ అనే రెండు ఇంజిన్లు కలిగిన దానిని హైబ్రిడ్ కారు అంటారు. అంటే ఇలాంటి వాటిలో ఉన్న రెండు ఇంజిన్లలో ఏదో ఒక దానిని ఉపయోగించుకోవచ్చు. పరిస్థితులను బట్టి ఏది వినియోగించినా సాఫీగా ప్రయాణం చేయొచ్చు. ఒక పెట్రోల్ కారులో పెట్రోల్ లేకపోతే ముందుకు వెళ్లదు. ఈవీలో చార్జీంగ్ లేకపోతే కదలదు. కానీ హైబ్రిడ్ కార్లలో రెండు ఇంజిన్లు ఉంటాయి. ఏదీ వీలైతే దాని ఇంజిన్ తో ఎక్కడికైనా, ఎంతదూరమైనా ప్రయాణించవచ్చు.

    ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ కార్ల హవా పెరిగిపోతుంది. పెట్రోల్, డీజిల్ కార్ల స్థానంలో ఈవీలే ఎక్కువగా వస్తాయన్న టాక్ వినిపిస్తోంది. కానీ వినియోగదారులు మాత్రం హైబ్రిడ్ కార్లను కోరకుంటున్నారు. కొన్ని నివేదికల ప్రకారం గత ఏప్రిల్, జూన్ 11 మధ్య కాలంలో ప్రతి నెల 7500 ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయాలు జరిగాయి. మొత్తంగా 15,000 ఈవీలు అమ్ముడుపోయాయి. ఇదే సమయంలో హైబ్రిడ్ అమ్మకాలు 59,814 ఉన్నాయి.

    ఎలక్ట్రిక్ కార్లు రూ.8 లక్షలతో ప్రారంభం అవుతాయి. కానీ హైబ్రిడ్ కారు రూ.17 లక్షల కంటే తక్కువ లేదు. అయినా వీటిని ఎందుకు కోరుకుంటున్నారంటే? ఈవీల కంటే హైబ్రిడ్ కార్లు మైలేజ్ ఎక్కువగా ఇస్తాయి. ఈవీలకు అన్ని చోట్లా ఛార్జింగ్ సదుపాయం ఉండదు. అయితే హైబ్రిడ్ లో ఇంధనంతో పాటు బ్యాటరీ సదుపాయం ఉంటుంది. దీంతో పరిస్థితులకు అనుగుణంగా ఇంజిన్ ను మార్చుకోవచ్చు. కొందరు నిపుణుల ప్రకారం సాధారణ కార్ల కంటే హైబ్రిడ్ కార్ల నుంచి కర్బన ఉద్గారాలు తక్కువ వెలువడుతున్నాయి.