https://oktelugu.com/

OTT: ఆ ఓటీటీలో వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్, ఒంటరిగా అసలు చూడొద్దు!

OTT: ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో అదిరిపోయే కంటెంట్ అందుబాటులోకి వస్తుంది. ఇక సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే ఆడియన్స్... భాష, ప్రాంతం అనే బేధం లేకుండా ఆదరిస్తున్నారు.

Written By:
  • S Reddy
  • , Updated On : July 2, 2024 / 03:13 PM IST

    Alone Movie 2020

    Follow us on

    OTT: థ్రిల్లర్స్ కి ఉండే క్రేజ్ వేరు. ఓ వర్గం ఆడియన్స్ ఈ జోనర్ ని అమితంగా ఇష్టపడతారు. ఊహకు అందని మలుపులు, ఉత్కంఠ రేపే సీన్స్ గొప్ప థ్రిల్ అందిస్తాయి. ఓటీటీ వచ్చాక సస్పెన్సు, క్రైమ్, హారర్ చిత్రాలకు కొదవ లేదు. పలు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో అదిరిపోయే కంటెంట్ అందుబాటులోకి వస్తుంది. ఇక సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే ఆడియన్స్… భాష, ప్రాంతం అనే బేధం లేకుండా ఆదరిస్తున్నారు. క్వాలిటీ కంటెంట్ ఎంజాయ్ చేస్తున్నారు.

    కాగా సస్పెన్సు థ్రిల్లర్స్ లవర్స్ తప్పక చూడాల్సిన చిత్రం ‘ఎలోన్’. ఈ హాలీవుడ్ మూవీ పర్ఫెక్ట్ సస్పెన్సు థ్రిల్లర్. ఒంటరైన అమ్మాయి ఎవరూ లేని అడవిలో ఒక సైకో బారిన పడుతుంది. అతడి నుండి తప్పించుకోవడానికి అనేక కష్టాలు పడుతుంది. ఎలోన్ చిత్రంలో మలుపులు ఊపిరి సలుపుకోనివ్వవు. సన్నివేశాలు ఒళ్ళు గగ్గుర్లు గొలిపేలా ఉంటాయి.

    ఆ అమ్మాయి సైకో బారి నుండి ఎలా తప్పించుకుంటుందని ప్రేక్షకులలో టెన్షన్ కలుగుతుంది. 2020లో ఎలోన్ చిత్రం విడుదలైంది. జాన్ హైమ్స్ దర్శకత్వం వహించాడు. జూల్స్ విల్ కాక్స్, మార్క్ మెన్చక ప్రధాన పాత్రలు చేశారు. బాక్సాఫీస్ వద్ద ఎలోన్ మూవీ చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టింది. ఎలోన్ డిజిటల్ రైట్స్ ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది.

    ప్రస్తుతం ఎలోన్ మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. కాబట్టి థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు తప్పక చూడండి. అదే సమయంలో ఒంటరిగా చూడకండి. మీ ఫ్రెండ్స్ తో చూస్తూ ఎంజాయ్ చేయండి. ఒంటరిగా చూస్తే మీ వెన్నులో వణుకు పుడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఇవాళే ఎలోన్ చిత్రాన్ని ప్రైమ్ లో చూసి మీ అభిప్రాయం తెలియజేయండి…