Lic Jeevan Anand: దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో పాలసీలను అమలు చేస్తోంది. ఎల్‌ఐసీ పాలసీలలో జీవన్ ఆనంద్ పాలసీ ఒకటి కాగా ఈ పాలసీ తీసుకోవడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీకి ఆర్థిక భద్రత అందించడంలో ఈ పాలసీ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఈ పాలసీ ద్వారా సులువుగా భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలను చేరవచ్చు.
18 నుంచి 50 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీకి అర్హులని చెప్పవచ్చు. ఈ పాలసీ నాన్ లింక్డ్ పాలసీ కాగా ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేసిన డబ్బులను స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ పాలసీకి గరిష్టి పరిమితి లేదు. కనీసం లక్ష రూపాయల నుంచి జీవన్ ఆనంద్ పాలసీని తీసుకునే అవకాశం ఉంటుంది. రోజుకు 76 రూపాయలు పొదుపు చేస్తే ఈ పాలసీ ద్వారా 10 లక్షల రూపాయలు పొందవచ్చు.
జీవన్ ఆనంద్ పాలసీకి పాలసీ టర్మ్, ప్రీమియం టర్మ్ ఒకే విధంగా ఉంటుంది. 24 సంవత్సరాల వయస్సులో 21 సంవత్సరాల టర్మ్ తో 5 లక్షల రూపాయల బీమా మొత్తానికి పాలసీని తీసుకుంటే సంవత్సరానికి 26,815 రూపాయలు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. నెలకు 2,281 రూపాయలు ప్రీమియం చెల్లించడం ద్వారా ఈ పాలసీని తీసుకోవచ్చు. మెచ్యూరిటీ సమయంలో ఈ పాలసీ ద్వారా 10.33 లక్షల రూపాయలు లభిస్తాయి.
రోజుకు కేవలం 76 రూపాయల ద్వారా ఈ పాలసీని తీసుకునే ఛాన్స్ ఉండటంతో పాటు ఈ పాలసీ తీసుకున్న వాళ్లకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది. సమీపంలోని ఎల్‌ఐసీ బ్రాంచ్ ను సంప్రదించి ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.