Diabetes: దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు షుగర్ తో బాధ పడుతున్నారు. ఆహారపు అలవాట్లు, జీవన శైలి వల్ల షుగర్ తో బాధ పడేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వైద్య నిపుణులు షుగర్ తో బాధ పడేవాళ్లు తీపి పదార్థాలకు దూరంగా ఉండాలని చెబుతారు. అయితే షుగర్ తో బాధ పడేవాళ్లు పంచదారకు బదులుగా స్టివియా ఆకులను వినియోగించవచ్చు. తెలుగులో ఈ ఆకులను మధుపత్రి అని పిలుస్తారు.
మధుపత్రి ఆకులను ప్రతిరోజు నమిలి తినడం ద్వారా సులభంగా షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకునే అవకాశం ఉంటుంది. పంచదార కంటే ఎక్కువ తియ్యగా ఉండే మధుపత్రి ఆకులు ఆరోగ్యానికి ఎలాంటి హాని చెయ్యవు. తులసి జాతికి చెందిన మధుపత్రిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ వైరల్, యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ఈ ఆకులు మధుమేహాన్ని అదుపులో ఉంచడంతో పాటు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
హైపర్ టెన్షన్, దంత సంబంధిత సమస్యలు, గ్యాస్, కడుపులో మంట, గుండె జబ్బులు, ఇతర సమస్యలకు మధుపత్రి ఆకులతో సులభంగా చెక్ పెట్టవచ్చు. తమలపాకులలా మధుపత్రి ఆకులను బుగ్గ దగ్గర పెట్టుకుని చప్పరిస్తే నోటి క్యాన్సర్ ఇతర ఆరోగ్య సమస్యలు దూరమయ్యే అవకాశం ఉంటుంది. నోటి దుర్వాసన సమస్యతో బాధ పడేవాళ్లు మధుపత్రి ఆకులను మౌత్ ఫ్రెషనర్ గా కూడా ఉపయోగించే ఛాన్స్ ఉంటుంది.
ఈ ఆకులను ఎండబెట్టుకొని దంచి పొడిలా చేసుకోవాలి. కాఫీ, టీతో పాటు కషాయంలో కూడా మధుపత్రి ఆకులను వినియోగించవచ్చు. స్టీవియాను వినియోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆయుర్వేద వైద్యులు సైతం మధుపత్రిని నిర్భయంగా తీసుకోవచ్చని చెబుతుండటం గమనార్హం.