Vastu Tips: మనలో చాలామంది అదృష్టాన్ని నమ్ముతారు. కొంతమంది ఏ పని చేసినా సులువుగా ఆ పనిలో సక్సెస్ సాధిస్తే మరి కొందరు మాత్రం ఏ పని చేసినా సక్సెస్ కాలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇంటి నిర్మాణంలో వాస్తు లోపాలు ఉంటే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందనే సంగతి తెలిసిందే. డ్రీమ్ హౌస్ ను నిర్మించుకునే సమయంలో కచ్చితంగా వాస్తు నిపుణుల సలహాలు, సూచనలను పాటిస్తే మంచిది.
వాస్తు ప్రకారం ఇంట్లో క్యాలెండర్లు ఎక్కువగా ఉండటం ఏ మాత్రం మంచిది కాదు. ఫోటోలను కూడా వీలైనంత తక్కువగా ఉంచితే మంచిదని చెప్పవచ్చు. ఈశాన్యంలో ప్రార్థనా స్థలాన్ని ఉంచుకోవడం ద్వారా నష్టపోక తప్పదని గుర్తుంచుకోవాలి. జీవితాంతం ఇంట్లో సంతోషంగా జీవించాలని భావించే వాళ్లు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. కిటికీ, తలుపులను ఉదయం సమయంలో తెరిచి ఉంచడం ద్వారా ఇంట్లో ఏవైనా ప్రతికూల శక్తులు ఉంటే తొలగిపోతాయి.
ఉతికిన దుస్తులు, విడిచిన దుస్తులను వేర్వేరుగా ఉంచాలి. ఈ దుస్తులను కలపడం వల్ల నష్టమే తప్ప ఏ మాత్రం లాభం ఉండదని గుర్తుంచుకోవాలి. ఒకరోజు వేసుకున్న దుస్తులను స్నానం చేసిన తర్వాత మళ్లీ వేసుకోకూడదు. వాస్తు ప్రకారం వాడని వస్తువులను చెత్తలో వేయడం ఏ మాత్రం మంచిది కాదు. వాడని వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల అరిష్టం కలుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
Also Read: అదృష్టం కలిసిరావాలా.. వాస్తు ప్రకారం కచ్చితంగా చేయాల్సిన ఐదు పనులివే!
నీటికి సంబంధించిన నియమాలు పాటించని వాళ్ల ఇంట్లో డబ్బు సులువుగా ఖర్చయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంట్లో నీటి లీకేజ్ ఉంటే ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఉత్తరం లేదా ఈశాన్యంలో బోర్ పంపును ఏర్పాటు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఇంటి ముందు తులసి మొక్కను నాటడంతో పాటు ప్రధాన తలుపును శుభ్రంగా ఉంచుకుంటే అదృష్టం కలిసొస్తుందని చెప్పవచ్చు. ఇంటిముందు అరటిచెట్టును నాటి ప్రతిరోజూ పూజిస్తే ఏ వ్యాపారం చేసినా కలిసొస్తుంది.
Also Read: తాంబూలంగా తమలపాకులు మాత్రమే ఇవ్వడానికి గల కారణం ఏమిటో తెలుసా?