Air India: జేఆర్డీ టాటా దేశంలో స్వాతంత్ర్యం రాకముందు స్థాపించిన విమానయాన సంస్థ తిరిగి ప్రభుత్వం చేతుల్లోంచి టాటాల చేతికే రావడం విశేషం. దాదాపు 90 ఏళ్ల తిరిగి సొంతగూటికి రావడం విశేషం. ఎయిర్ ఇండియాను నెలకొల్పిన టాటా సంస్థ చేతికే ఇది మళ్లీ చేరింది.
ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోంది. ఇందులో భాగంగా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను సైతం అమ్మేసింది. అయితే మూసేయడం.. లేదంటే అమ్మేయడం మరో మార్గం లేని పరిస్థితుల్లో అమ్మకానికి పెట్టింది. టాటా సన్స్ సంస్థ ఎయిరిండియాను సొంతం చేసుకుంది. ఇకపై దాని ఆధీనంలోనే సంస్థ కొనసాగనుంది. ఈమేరకు ప్రభుత్వం ఈరోజు అధికారికంగా అప్పగించేసి చేతులు దులుపేసుకుంది.
ఈమేరకు కేంద్ర పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (డీఐపీఏం-దీపమ్) కార్యదర్శి తుమిన్ కాంత పాండే శుక్రవారం అధికారిక ప్రకటన చేశారు. టాటా బిడ్స్ దాఖలు చేసిన బిడ్ అన్నింటికంటే ఆకర్షణీయంగా ఉండడంతో ఎయిరిండియాను అప్పట్లోనే దానికి కట్టబెట్టారు. ఇన్నేళ్ల తరువాత ఎయిరిండియా తిరిగి టాటా చేతుల్లోకి వెళుతోంది.
1932లో టాటా ఎయిర్ లైన్స్ పేరుతో విమానయాన సంస్థను ప్రారంభించింది టాటానే. తొలి విమానాన్ని కరాచీ -బొంబాయి మధ్య ప్రారంభించారు. 1946లో ఎయిర్ ఇండియాగా మార్చారు. ఆ తర్వాత యూరప్ కు విమానాలునడిపారు. 1948లో ప్రభుత్వ, ప్రైవేటు(టాటా) వాటాలతో అంతర్జాతీయ సేవలు ప్రారంభించారు. 1953లో జాతీయీకరణలో భాగంగా ప్రభుత్వం సొంతం చేసుకుంది. 1977 వరకు టాటాయే సంస్థను నడిపించింది.
తిరిగి మళ్లీ దాని చేతుల్లోకే వెళ్లడం గమనార్హం. దీంతో ఎయిరిండియా యజమాని టాటా సన్స్ కానుంది. ప్రభుత్వ రంగ సంస్థల మనుగడ ప్రశ్నార్థకంలో పడుతోంది. నిర్వహణ భారంతో సంస్థలను అమ్ముకుంటూ పోతే ఎలాగని ప్రతిపక్షాలు సైతం గోల చేస్తున్నాయి.