Job Vacancies: పదో తరగతి అర్హతతో 1501 ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

Job Vacancies: మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఈ సంస్థ నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి ఈ సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 1501 ఉద్యోగ ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా ఈ నోటిఫికేషన్ లో వేర్వేరు ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. 18 సంవత్సరాల నుంచి 38 […]

Written By: Kusuma Aggunna, Updated On : January 28, 2022 1:11 pm
Follow us on

Job Vacancies: మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఈ సంస్థ నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి ఈ సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 1501 ఉద్యోగ ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా ఈ నోటిఫికేషన్ లో వేర్వేరు ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

Job Vacancies

18 సంవత్సరాల నుంచి 38 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. అర్హతతో పాటు అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

Also Read: 105 పవర్ గ్రిడ్ ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ .. భారీ వేతనంతో?

30 మార్కులకు రాత పరీక్ష ఉండగా టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయని సమాచారం. 2022 సంవత్సరం మార్చి 15వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన రాత పరీక్ష జరగనుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ మొదలుకానుంది. 2022 సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీ దరఖాస్తులకు చివరితేదీగా ఉంది.

అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. https://mazagondock.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

Also Read: విశాఖలో 31 ఉద్యోగ ఖాళీలు.. రూ.90 వేలకు పైగా వేతనంతో?