https://oktelugu.com/

Lord Shiva: విగ్రహ రూపంలో తలకిందులుగా దర్శనమిచ్చే పరమేశ్వరుడి ఆలయం ఎక్కడుందో తెలుసా?

Lord Shiva: సాధారణంగా మనకు శివుడి ఆలయం అంటే ఆలయంలో విగ్రహానికి బదులుగా లింగం దర్శనమిస్తుంది. పరమేశ్వరుడు ఎక్కువగా లింగరూపం లోనే దర్శనం ఇవ్వడం వల్ల ప్రతి శివాలయంలోనూ స్వామివారు లింగరూపంలో కనిపిస్తారు. అయితే పరమేశ్వరుడు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఆలయాలు గురించి చాలా తక్కువగా వినే ఉంటాము. ఇలా స్వామి వారి విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఆలయాలలో ఒకటిగా పేరుగాంచినది శక్తిశ్వరాలయం ఒకటి. మరి ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 20, 2022 / 12:59 PM IST

    Lord Shiva

    Follow us on

    Lord Shiva: సాధారణంగా మనకు శివుడి ఆలయం అంటే ఆలయంలో విగ్రహానికి బదులుగా లింగం దర్శనమిస్తుంది. పరమేశ్వరుడు ఎక్కువగా లింగరూపం లోనే దర్శనం ఇవ్వడం వల్ల ప్రతి శివాలయంలోనూ స్వామివారు లింగరూపంలో కనిపిస్తారు. అయితే పరమేశ్వరుడు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఆలయాలు గురించి చాలా తక్కువగా వినే ఉంటాము. ఇలా స్వామి వారి విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఆలయాలలో ఒకటిగా పేరుగాంచినది శక్తిశ్వరాలయం ఒకటి. మరి ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

    Lord Shiva:

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా యనమదుర్రు అనే గ్రామంలో ఈ ఆలయం కలదు. ఈ ఆలయం పంచారామాలలో ఒకటయిన భీమవరంకు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇలా ఈ గ్రామంలో వెలసిన శక్తిశ్వరాలయం ఎంతో విశిష్టమైనది.ఈ ఆలయంలో స్వామివారు లింగ రూపం లో కాకుండా విగ్రహ రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు. అయితే విగ్రహ రూపంలో కూడా స్వామివారు శీర్షాసన భంగిమ రూపంలో దర్శనమిస్తారు.

    Also Read: ఏపీని ఊరిస్తున్న ‘బిలియన్ డాలర్ల ఐడియా’.. అమలే కష్టం..

    ఈ విధంగా పరమేశ్వరుడు విగ్రహ రూపంలో అదికూడా తలకిందులుగా భక్తులకు దర్శనం ఇవ్వడం ఈ ఆలయ ప్రత్యేకత. అలాగే శక్తి పీఠంలో శివుడు పార్వతి దేవి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముగ్గురు కలిసి ఒకే పీఠంపై దర్శనమివ్వడం ఈ ఆలయ ప్రత్యేకత. ఇలా పరమేశ్వరుడు శీర్షాసనం భంగిమలో భక్తులకు దర్శనమివ్వడంతో ఈ స్వామివారిని దర్శనం చేసుకోవడం కోసం భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆలయానికి చేరుకుంటారు. ముఖ్యంగా మాఘమాసం, శివరాత్రి వంటి పర్వదినాలలో ఈ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది.

    Also Read: వినుకొండలో ఘనంగా ‘అఖండ’ వేడుకలు !