India corona update : చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనా మహమ్మారి రూపాలు మార్చుకుంటూ విరుచుకుపడుతూనే ఉంది. తాజాగా ‘ఒమిక్రాన్’ పేరిట ప్రపంచాన్ని భయపెడుతోంది. దేశంలో ఈ చలికాలంలో కేసుల తీవ్రత పెరిగింది. పైగా సంక్రాంతి పండుగలు తోడు కావడంతో మరిన్ని కేసులు నమోదవుతున్నాయి. దేశం మెల్లిగా థర్డ్ వేవ్ దిశగా సాగుతోంది.
India corona update :
మొన్నటివరకూ రెండున్నర లక్షలకు పైగా నమోదైన కేసులు తాజాగా మూడు లక్షలకు చేరువయ్యాయి. దేశంలో కరోనా తీవ్రరూపం దాల్చుతోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. మూడు లక్షల మార్కును దాటేసి ఆందోళనకు గురిచేస్తోంది.
Also Read: వందల కోట్లు ఉన్న నిర్మాతకు ఆర్ధిక సాయం అవసరమా జగన్ ?
దేశంలో తాజాగా 19 లక్షల మందికి పరీక్షలు చేయగా.. 3,17,532 మంది వైరస్ బారినపడ్డారు. ముందురోజు కంటే 12శాతం అధికంగా కొత్త కేసులు వెలుగుచూశాయి. పాజిటివిటీ రేటు 15 శాతం నుంచి 16.41 శాతానికి పెరిగి ఆందోళన కలిగిస్తోంది. మరణాలు ఎక్కువవ్వడం భీతి గొలుపుతోంది. 24 గంటల వ్యవధిలో 491 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ 3.82 కోట్ల మందికి కరోనా సోకగా.. 4,87,693 మంది మహమ్మారికి బలయ్యారు.
ఇక కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వల్ల కేసులు పెరుగుతున్నాయి. ఆ వేరియంట్ కేసులు 9287కి చేరాయి. కొద్దివారాలుగా వైరస్ విజృంభిస్తుండడంతో క్రియాశీల కేసులు 19 లక్షలు దాటాయి. క్రియాశీల రేటు 5.03 శాతానికి పెరిగిపోయింది. దీంతో క్రమంగా దేశం థర్డ్ వేవ్ లోకి వెళ్లిపోయే ప్రమాదంలో పడింది.