Vishwak Sen: యంగ్ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడిగా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా రాబోతుంది. బాపినీడు – సుధీర్ నిర్మించిన ఈ సినిమాతో, విద్యాసాగర్ చింత దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నాయికగా రుక్సార్ థిల్లాన్ నటించింది. అయితే ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను కొంత సేపటి క్రితం విడుదల చేశారు. ‘మాటరాని మాయవా .. మాయజేయు మాటవా’ అంటూ ఈ పాట మొదలవుతోంది. కాగా ఈ ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ లిరికల్ సాంగ్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

Also Read: ‘అఖండ’ అమ్మ సాంగ్ అదరగొడుతుంది !
ఇక హీరో విశ్వక్ సేన్ రీసెంట్ గా కరోనా వ్యాధికి గురై.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ రాకముందు గత కొన్ని రోజులుగా విశ్వక్‌సేన్ షూటింగ్ లో పాల్గొన్నాడు. పైగా కరోనా అని తేలింది కూడా ఈ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా షూటింగ్ స్పాట్ లోనే. దాంతో ఈ సినిమాకి చెందిన యూనిట్ సభ్యులు ఐసోలేషన్ కి వెళ్లక తప్పలేదు.
అయితే, ఐసోలేషన్ లో చిత్రబృందం ప్రమోషన్స్ పై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఈ రోజు ఈ సాంగ్ ను కూడా రిలీజ్ చేసింది. ఇక తనకు కరోనా వచ్చిన సంగతి పై విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘నాకు కరోనా పాజిటివ్ వచ్చిన దగ్గర నుంచి నేను డాక్టర్లు ఇచ్చిన సూచనలు పాటిస్తున్నాను. నిజానికి నేను వ్యాక్సిన్ వేయించుకున్నాను. అయినా నాకు కరోనా పాజిటివ్ రావడం దురదృష్టకరం. దయచేసి అందరూ మాస్కులు ధరించి జాగ్రత్తగా ఉండండి’ అంటూ విశ్వక్ చెప్పుకోచ్చాడు.
Also Read: వైరల్ అవుతున్న ప్రభాస్ కొత్త లుక్ !

[…] […]
[…] BJP Bandi Sanjay: తెలంగాణలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న భారతీయ జనతా పార్టీకి అప్పుడే అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. పార్టీలోని ఓ వర్గం అసమ్మతి వ్యక్తం చేయడంతో నాయకులు రెండు వర్గాలుగా విడిపోయినట్లు తెలుస్తోంది. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ నాయకులు.. తమకు ప్రాధాన్యం లేదని అసంతృప్తితో ఉన్నారట.. ఇందులో భాగంగా ప్రత్యేకంగా రహస్య మీటింగ్ కూడా పెట్టుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ విషయం తెలిసిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. సీనియర్ల సమాధానం కోసం అధిష్టానం ఎదురుచూస్తోందట.. అయితే బీజేపీకి అంతో ఇంతో బలం ఉన్న కరీంనగర్ నియోజకవర్గంలోనే ఈ ధిక్కార స్వరాలు రావడం ఆసక్తి రేపుతోంది. […]
[…] Corona: దేశవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు తగు సూచనలు చేసింది. నిర్లక్ష్యం వహిస్తే మొదటికేమోసం వస్తుందని హెచ్చరించింది. ప్రస్తుతం దేశంలో ఒక్క రోజులో మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇక రాష్ట్రాల వారీగా చూసుకుంటే ఎప్పటిలాగానే మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, మధ్య ప్రదేశ్, ఏపీ రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయని కేంద్రం ప్రకటించింది. ఇక తెలంగాణలోనూ రోజువారీగా 3వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. వారం రోజుల్లోనే ఈ సంఖ్య 24వేలు దాటగా.. ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య మూడు రెట్లు పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. […]