Kitchen Tips: కిచెన్, బాత్రూమ్ లలో మొండి మరకలా.. ఒకసారి ఇలా చేయండి

నీటిలో ఉండే ఉప్పు వల్ల వచ్చిన మరకలు బాత్ రూమ్ లో సులభంగా తొలగించవచ్చు. కేవలం 10 రూ. లతో బాత్రూమ్ మొత్తాన్ని మెరిసేటట్లు, సువాసనతో నింపేయవచ్చు.

Written By: Swathi, Updated On : April 30, 2024 9:01 am

Kitchen Tips

Follow us on

Kitchen Tips: వంటగది, బాత్ రూమ్ ఈ రెండింటిని ఎన్ని సార్లు శుభ్రం చేసినా సరే క్లీన్ అవవు. చాలా కష్టం కదా. కిచెన్ టైల్స్, బాత్రూం టైల్స్ ఫుల్ గా బాధపెడతాయి. కిచెన్ టైల్స్ ను కాస్త మెరిసేలా చేయవచ్చు కానీ బాత్ రూమ్ టైల్స్ ను మాత్రం భరించడం కష్టమే. నీటిలోని ఉప్పు టైల్స్ పై పేరుకొని మురికిగా కనిపిస్తాయి. వీటి కోసం చాలా మంది అధికంగా డబ్బు ఖర్చు చేస్తూ లిక్విడ్ లను కొనుగోలు చేస్తుంటారు. అయినా లాభం ఉండదు. అయితే ఈ టిప్స్ పాటించండి. మీ కిచెన్, బాత్ రూమ్ టైల్స్ మెరుస్తాయి.

నీటిలో ఉండే ఉప్పు వల్ల వచ్చిన మరకలు బాత్ రూమ్ లో సులభంగా తొలగించవచ్చు. కేవలం 10 రూ. లతో బాత్రూమ్ మొత్తాన్ని మెరిసేటట్లు, సువాసనతో నింపేయవచ్చు. అంతేకాదు మీ టైల్స్ పై మళ్లీ ఉప్పు మరకలు రాకుండా కూడా చేయవచ్చు. ఇక టైల్స్ నుంచి ఉప్పు మరకలను తొలగించడానికి ఒక గిన్నెలో కొద్దిగా రాక్ ఉప్పు తీసుకోవాలి. మరకల స్థాయిని బట్టి దీన్ని తీసుకోండి. ఇందులో కాస్త నిమ్మరసం పిండండి. తర్వాత ఒక చెంచా వాషింగ్ పౌడర్ ను వేసి బాగా కలపండి.

ఈ మిశ్రమంలో కొంచెం సోడా సాల్ట్ వేయండి. ఇందులో 3 స్పూన్ల వెనిగర్ ను కలపండి. వెనిగర్ లేకపోతే స్కిప్ చేయండి. నీరుతో సర్దిపెట్టుకోండి. దీన్ని ఒక పేస్ట్ లా చేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ పేస్ట్ ను టైల్స్ పై అప్లై చేయండి. మరక పట్టిన పలకలపై రుద్ది 10 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత గిన్నె రుద్దడానికి వాడే ఐరన్ పీచుతో తేలికగా రుద్దితే చాలు ఎన్ని సంవత్సరాల మరకలు అయినా సరే ఇట్టే తొలిగిపోతాయి.

బాత్రూమ్ మరకను తొలగించిన తర్వాత నీటితో పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. టైల్స్ పై కాస్త కొబ్బరి నూనెను వేయండి. ఇలా చేయడం వల్ల మళ్లీ మరకలు రాకుండా ఉంటాయి. ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల మీ బాత్రూమ్, కిచెన్ మెరిసిపోతుంది. మరి తెలుసుకున్నారు కదా ఇక క్లీన్ చేసేయండి.