Homeబిజినెస్Kia Sonet Record Sales: 1.5 లక్షల అమ్మకాలను అధిగమించిన కియా సోనెట్

Kia Sonet Record Sales: 1.5 లక్షల అమ్మకాలను అధిగమించిన కియా సోనెట్

Kia Sonet Record Sales: హైదరాబాద్: దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కార్ల మాన్యుఫాక్చరింగ్ సంస్థకియా ఇండియా మరో అడుగు ముందుకేసింది. కేవలం రెండేళ్లలోనే కియా ఇండియా స్మార్ట్ అర్బన్ కాంపాక్ట్ SUV కియా సోనెట్ 1.5 లక్షల యూనిట్ల అమ్మకాలు జరిపింది. సెప్టెంబరు 2020లో ప్రారంభించిన రెండు సంవత్సరాలలోపు ఈ వాహనం ఈ అద్భుతమైన విజయాన్ని సాధించింది. KIN మొత్తం అమ్మకాలలో 32శాతం కాంపాక్ట్ SUV సెగ్మెంట్ మోడల్‌గా ముందంజలో నిలిచింది. కియా సోనెట్ భారతదేశంలో ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్(iMT) సాంకేతికతతో మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. 25శాతంపైగా సోనెట్ కొనుగోలుదారులు ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో కూడిన వాహనాన్ని ఇష్టపడు తున్నారు. కాంపాక్ట్ SUV విభాగంలో దాదాపు 15శాతం వాటాతో కియా సోనెట్ గేమ్-ఛేంజర్ ప్రోడక్ట్ గా నిలిచింది.

Kia Sonet Record Sales
Kia Sonet

ఈ సందర్భంగా కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ మ్యుంగ్-సిక్ సోహ్న్ మాట్లాడుతూ, “సోనెట్ కియా ఇండియాకి 1.5 లక్షల మంది కస్టమర్లు ఉండడం పట్ల సంతోషంగా ఉన్నాం. కస్టమర్ అభిరుచులకు నచ్చినవిధంగా సాంకేతిక పరిజ్ఞానం అందించినందుకు మేము చాలా గర్వపడుతున్నాము”. ఈ సెగ్మెంట్‌లో డీజిల్ AT మాత్రమే ఉంది. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో, మేము సోనెట్ తక్కువ వేరియంట్‌లలో కూడా 4 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా జోడించాము, ఇది వాహనం భద్రతను మరింత మెరుగుపరుస్తుంది. అదే కారణంగా ప్రజాదరణ పెరిగిందని కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ మ్యుంగ్-సిక్ సోహ్న్ పేర్కొన్నారు.

Also Read: BJP presidential candidates: బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థుల ఎంపికే విభిన్నం.. వారి గురించి తెలిస్తే ఎవరైనా సెల్యూట్ కొట్టాల్సిందే..

Kia Sonet Record Sales
Kia Sonet

సోనెట్ కస్టమర్‌లు వాహనం టాప్ వేరియంట్‌ల పట్ల గొప్ప అనుబంధా న్ని కనబరిచారు, దాని మొత్తం అమ్మకాలలో 26 శాతంకి సహకరించారు. 22శాతం కొనుగోలుదారులు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో తమ సోనెట్‌ను ఇష్టపడతారు కాబట్టి, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కోసం పెరుగుతున్న డిమాండ్‌ను సోనెట్ విక్రయాలలో కూడా గమనించవచ్చు. సోనెట్ డీజిల్ పవర్‌ట్రెయిన్‌తో కూడా ప్రసిద్ధి చెందింది. సోనెట్‌ గ్లేసియర్ వైట్ పెర్ల్ ,అరోరా బ్లాక్ పెర్ల్ రెండు రకాల కలర్స్ ఉన్నాయి. ఇన్నోవేషన్ , స్టైలిష్ లుక్‌ల తోపాటు, కియా సోనెట్ నమ్మకంగా, కాంపాక్ట్ బాడీలో డైనమిక్ అట్టిట్యూడ్ ని అందిస్తుంది. కియా సోనెట్ టెక్ లైన్ , GT-లైన్ డ్యూయల్ ట్రిమ్ కాన్సెప్ట్‌తో ఈ విభాగంలో వాస్తవంగా అన్ని అవసరాలకు అనుగుణంగా బహుళ పవర్‌ట్రెయిన్ ఎంపికలతో అందించనున్నారు. భద్రతా సమస్యలు పెరుగుతున్నందున, సోనెట్ తక్కువ వేరియంట్‌ లలో కూడా కనిష్టంగా నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తోంది.

Also Read: Pavan Kalyan Bandla Ganesh: బండ్ల గణేష్ ని పవన్ కళ్యాణ్ అందుకే దూరం పెట్టాడా?

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular