Homeట్రెండింగ్ న్యూస్Arudra Worms: అన్నదాతలకు మేలు చేసే నేస్తాలు.. ఆరుద్ర పురుగులు..

Arudra Worms: అన్నదాతలకు మేలు చేసే నేస్తాలు.. ఆరుద్ర పురుగులు..

Arudra Worms: హైదరాబాద్ : ఆరుద్ర పురుగును కొన్ని చోట్ల.. పట్టు పురుగు అనీ , చందమామ పురుగు అనీ , లేడీ బర్డ్ అనీ, ఇంద్రగోప పురుగు అని కూడా అంటారు. ఇలా చాలా పేర్లు ఉన్న ఈ పురుగు చూడటానికి ఎర్రని బట్టతో చేసిన బొమ్మలాంటి పురుగులా ఉంటుంది. ముట్టుకుంటేనే అత్తిపత్తి మొక్క ఆకుల్లా ముడుచుకు పోయే స్వభావం ఉన్న ఈ పురుగులు నేలమీద కాసింత ఇసుక నేలల్లో, పచ్చగడ్డి కాసింత ఉన్న చోట్లలో విరివిగా కనిపిస్తాయి. ఈ అందమైన, మెత్తనైన పురుగులు వర్షాకాలం తొలకరి వర్షాలు కురవగానే కుప్పలు కుప్పలుగా కనిపించి కనువిందు చేస్తాయి.

Arudra Worms
Arudra Worms

ఆరుద్ర కార్తె పేరు వినగానే మొదట ఆరుద్ర పురుగులు గుర్తుకొస్తాయి. తొలకరి జల్లులు కురియగానే వాతావరణం చల్లబడి నల్లని నేలపై ఇవి ఎర్రని బొట్లుగా మెరుస్తూ కనిపిస్తాయి. వర్షాలు కురుస్తుండటంతో ఈ మృగశిర కార్తెలోనే ఆరుద్ర పురుగులు నేలపై తిరుగుతూ సందడి చేస్తుంటాయి. రైతులకు ఆనందం కలిగిస్తుంటాయి. అన్నదాతలకు మేలు చేసే ఈ పర్యావరణ నేస్తాలు. ప్రస్తుత తరానికి ఈ ఆరుద్ర పురుగులు అంటే తెలియదు.. కానీ పల్లెటూళ్లో ఉండే వారందరికీ ఆ పురుగులు ఏంటో అవి ఎలా ఉపయోగ పడతాయనేది కొంతమందికి మాత్రమే తెలుసు. ఈ ఆరుద్ర పురుగులు రైతులు దుక్కులు దున్నాక పొలాల్లో సందడి చేస్తాయి.

Also Read: Kia Sonet Record Sales: 1.5 లక్షల అమ్మకాలను అధిగమించిన కియా సోనెట్

వీటిని ఏ రైతు చంపడు..ఎవ్వరినీ చంపనీయడు.. దేవతలకు,వరుణ దేవుడికి ప్రతిరూపంగా వీటిని భావిస్తారు.. కొలుస్తారు..అలాంటి ఆరుద్ర పురుగులు వర్షాలు బాగపడి కాలమవుతుందనుకుంటేనే మనుషులకు కనిపిస్తాయి. ఈ పురుగులు గ్రామాల్లో కనిపించాయంటే రైతులు సంతోషంతో గంతులేస్తారు. ఎందుకంటే ఆరుద్ర పురుగులు కనిపించాయంటే ఆ సంవత్సరం సంవృద్ధిగా వర్షాలు పడతాయని సంకేతం.. చెరువులు, కుంటలు , ప్రాజెక్టులు నిండుతాయనే ధీమా రైతుల్లో నెలకొంటుంది.ఈ అరుద్ర పురుగులు మనకు కనిపిస్తున్నాయంటే ఈసారి కాలమైనట్టే లెక్క.. ‘అరుద్ర’తో రైతుల కళ్ళల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

Arudra Worms
Arudra Worms

బీడువారిన నేతలపై తొలకరి జల్లులు పడగానే బిలబిలామంటూ ఆరుద్ర పురుగులు నేలపైకి వచ్చేస్తాయి. అలా ఆరుద్రపురుగులు నేలపై కనిపిస్తే ఆ సంవత్సరం వర్షాలు ఎక్కువగా కురుస్తాయనీ..రైతన్నలు చక్కగా వ్యవసాయం చేసుకోవచ్చని అంటారు. అలా..ఆరుద్ర పురుగులకు , రైతులకు అవినాభావ సంబంధం ఉంది. ఎర్రగా , బొద్దుగా చూడ ముచ్చటగా ఉండే ఆరుద్ర పురుగు ఆగమనాన్ని రైతులు శుభసూచకంగా భావిస్తారు. ఇక వ్యవసాయం పనులు మొదలు పెట్టుకోవచ్చని ఆనందంగా పొలాలకు వెళ్తారు. ఎర్రగా…చక్కటి రంగులో మెరిసిపోయే ఈ అందమైన పురుగులు తొలకరి వర్షాలు కురవగానే కుప్పలు కుప్పలుగా కనిపించి కనువిందు చేస్తాయి. వ్యవసాయ పనులు మొదలు పెట్టేందుకు ఆరుద్ర కార్తె అనుకూలమైంది.

Arudra Worms
Arudra Worms

ఈ కార్తెలో మాత్రమే కనబడే అరుదైన పురుగు ఆరుద్ర. అందుకే దాన్ని ఆరుద్ర పురుగు అంటారు. ఇవి ప్రకృతి నేస్తాలు. సాధారణంగా ఈ ఆరుద్ర పురుగులు ఆరుద్ర కార్తెలో కనిపిస్తాయి. ఈ పురుగులను రైతులు చూస్తే చాలు ఆనందంతో పరవశించిపోతారు. ఎందుకంటే ఆరుద్ర పురుగులు కనిపిస్తే ఏడాదంతా వర్షాలు సంవృద్ధిగా కురుస్తాయని రైతులు నమ్ముతారు. మనిషి స్వార్థం కోసం విపరీతంగా ఎరువులు, రసాయనాలు వాడుతూ పుడమి తల్లిని కాలుష్యకాసారంగా మారుస్తున్నాడు. దీంతో వీటి ఉనికికే ప్రమాదం ఏర్పడుతోంది.

Also Read:BJP presidential candidates: బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థుల ఎంపికే విభిన్నం.. వారి గురించి తెలిస్తే ఎవరైనా సెల్యూట్ కొట్టాల్సిందే..

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular