BJP presidential candidates : కేంద్రంలోని అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఎవ్వరూ ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకోవడం బీజేపీకి అలవాటు.. అదే కాంగ్రెస్ పార్టీ తమ పార్టీలోని సీనియర్ రాజకీయ కురువృద్ధులను రాష్ట్రపతులుగా నియమిస్తూ వస్తుంటుంది. యూపీఏ హయాంలో కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీని అలానే చేసేసింది. కులాలు, మతాలు, ఇతర సామాజిక సమీకరణాలతో సంబంధం లేకుండా కేవలం తమ పార్టీలోని పెద్దలకే పెద్దపీట వేస్తుంటుంది.
అయితే బీజేపీ మాత్రం ఎప్పుడూ విభిన్నమే.. సామాజిక కోణంలో అస్సలు ఎవరూ ఊహించని వ్యక్తులకు పట్టం కడుతోంది. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థులందరూ సామాన్యులు, మేధావులు, దేశానికి సేవ చేసిన ప్రముఖులే కావడం విశేషం.

-అణుపితామహుడిని రాష్ట్రపతిని చేసిన బీజేపీ
నాడు వాజ్ పేయి హయాంలో దేశ అణుపితామహుడు.. కష్టపడి పైకొచ్చిన అణుశాస్త్రవేత్త అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా చేసి అందరి మనసు చూరగొన్నది. కలాం 1931లో అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించాడు. దేశంలో ఐకే గుజ్రాల్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత వాజ్ పేయి తమ ప్రభుత్వంపై ఉన్న ముస్లిం వ్యతిరేకతను తగ్గించుకోవడంతోపాటు దేశానికి సేవలందించిన గొప్ప వారికి రాష్ట్రపతిని చేయాలని భావించాడు. దేశానికి గొప్ప సేవ చేసి.. అణుబాంబులను కనిపెట్టి భారత రత్న అందుకున్న కలాం అయితేనే రాష్ట్రపతిగా పర్ ఫెక్ట్ అని నాడు బీజేపీ నిర్ణయించి ఆయనను చేసింది. అంత గొప్ప దేశభక్తుడు లేదని ఇలా చేసింది.
-దళితులకు గౌరవంగా కోవింద్ కు రాష్ట్రపతి పీఠం
1945 అక్టోబర్ 1న ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దేహాత్ జిల్లాకు చెందిన పరౌఖ్ జన్మించిన రాంనాథ్ కోవింద్ దళిత కుటుంబంలో పుట్టి ఒక సాధారణ గుడిసెలో జీవించాడు. ఐదేళ్ల వయసులో తల్లిని కోల్పోయి కష్టపడి చదివి డిగ్రీ, ఎల్ఎల్ బీ చదివి న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టాడు.1991లో బీజేపీలో చేరి 1994లో యూపీ నుంచి బీజేపీ రాజ్యసభ ఎంపీగా ఎంపికయ్యాడు. 2015 ఆగస్టు 8న బీహార్ గవర్నర్ గా బీజేపీ ప్రభుత్వం నియమించింది. ఇక మోడీ 2014లో రాష్ట్రపతి అయ్యాక దళిత వర్గానికి రాష్ట్రపతి ఇవ్వాలని నిర్ణయించాడు. ఈ క్రమంలోనే గవర్నర్ గా ఉన్న రాంనాథ్ కోవింద్ కు పట్టం కట్టారు. బలహీన వర్గాలను ప్రోత్సహించాలని.. దళితులకు సమున్నత గౌరవం ఇవ్వాలని దేశానికే ప్రథమ పౌరుడిగా కోవింద్ ను చేశారు.
-గిరిజన మహిళ ద్రౌపది ముర్మకు రాష్ట్రపతి పీఠం
ఒకసారి దేశ అణు పితామహుడికి ఇచ్చి దేశభక్తిని చాటిన బీజేపీ ఆ తర్వాత దళితవర్గానికి దేశ అత్యున్నత పీఠం ఇచ్చింది. ఈసారి దేశంలోనే అణగారిన గిరిజన వర్గానికి పెద్దపీట వేసింది. ఒడిషాకు చెందిన విద్యావంతురాలు.. మాజీ గవర్నర్ అయిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. ద్రౌపది ఆర్ట్స్ పట్టభద్రురాలు. ఆపై సాగునీటి శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేశారు. కొంతకాలం స్వచ్ఛందంగా బోధనా రంగంలో.. అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. నగర పంచాయతీ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. అటునుంచి ఎమ్మెల్యే.. మంత్రి.. గవర్నర్..! ఇప్పుడు ఏకంగా అధికార కూటమి రాష్ట్రపతి అభ్యర్థి. 64 ఏళ్ల ద్రౌపది ముర్ము అత్యంత పేద కుటుంబంలో పుట్టారు. ఆమె 25 ఏళ్లలో రాజకీయాల్లో కిందిస్థాయి పదవి అయిన కౌన్సిలర్ నుంచి అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి పోటీ పడే స్థాయికి ఎదిగారు. వెనుకబడిన ఒడిస్సా రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన మయూర్‌భంజ్ జిల్లా బైడపోసి గ్రామంలో 1958 జూన్ 20న గిరిజన కుటుంబంలో జన్మించారు.. వీరిది గిరిజన వర్గంలోని సంథాల్ తెగ. పేదరికపు అడ్డంకులను అధిగమిస్తూ విద్యాభ్యాసం సాగించారు. భువనేశ్వర్‌లోని రమాదేవి మహిళా కళాశాలలో డిగ్రీ చదివారు. ఆర్ట్స్ విద్యార్థి అయిన ముర్ము.. సాగునీటి-విద్యుత్తు శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేశారు. రాయ్‌రంగాపూర్‌లోని శ్రీ అరబిందో సమీకృత విద్యా కేంద్రంలో స్వచ్ఛందంగా ఉపాధ్యాయురాలిగా పనిచేశారు.
మూడేళ్లకు మంత్రిరాజకీయ రంగప్రవేశం తర్వాత ద్రౌపది ముర్ము బీజేపీ తరఫున 1997లో రాయ్‌రంగ్‌పూర్ నగర పంచాయతీ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 2000 సంవత్సరంలో రాయ్‌రంగ్‌పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బిజూ జనతాదళ్ (బీజేడీ), బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో 2000-2004 మధ్య వాణిజ్య, రవాణా, మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఒడిస్సాలో ఉత్తమ పనితీరు కనబరిచే ఎమ్మెల్యేలకు అందించే నీలకంఠ అవార్డును 2007లో అందుకున్నారు. 2004లో రెండోసారి ఎన్నికయ్యారు. పార్టీపరంగా బీజేపీ ఒడిస్సా ఎస్టీ మోర్చా ఉపాఽధ్యక్షురాలు, అధ్యక్షురాలిగా వ్యవహరించారు. 2010, 2013లో రెండుసార్లు మయూర్‌భంజ్ పశ్చిమ జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2013లో ముర్మును బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా నియమించారు. మయూర్‌భంజ్ పశ్చిమ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నప్పుడే.. 2015 మే 18న జార్ఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2021 జూన్ 12 వరకు ఆ పదవిలో కొనసాగారు. జార్ఖండ్ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్‌గా ద్రౌపది ముర్ము చరిత్రకెక్కారు.
స్వాతంత్య్రం తర్వాత పుట్టిన తొలి అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము.. రాష్ట్రపతిగా ఎన్నికైతే పలు ఘనతలు ఆమె ఖాతాలో చేరనున్నాయి. తొలి గిరిజన, తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగానే కాక.. స్వాతంత్య్రం తర్వాత జన్మించిన తొలి రాష్ట్రపతి ఈమెనే కానున్నారు. ఇప్పటివరకు భారత రాష్ట్రపతిగా ఎన్నికైన వారంతా 1947కు ముందు జన్మించినవారే.
ఇలా అనూహ్యంగా బీజేపీ ఈసారి గిరిజన మహిళకు అవకాశం ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. సామాన్యులు, పేదరికం నుంచి వచ్చిన ఒక మహిళకు పట్టం కట్టింది. ప్రతీసారి బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థుల ఎంపిక విభిన్నంగా సాగుతుంది. వారి గురించి తెలిస్తే ఎవరైనా సెల్యూట్ కొట్టాల్సిందే అన్నట్టుగా ఎంపికలుంటున్నాయి. ఎవరూ ఊహించని అతి సామాన్యులను అత్యంత పెద్ద పదవులను అధిరోహించేలా చేసి బీజేపీ సమున్నత గౌరవం కల్పిస్తోంది. బీజేపీలో ఎవరైనా ఏదైనా కాగలరన్న నమ్మకాన్ని కలిగిస్తోంది.
[…] Also Read: BJP presidential candidates: బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థ… […]
[…] Also Read: BJP presidential candidates: బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థ… […]