Kamdhenu Vastu: జీవితం ఆనందంగా ఉండాలంటే ఆధ్యాత్మిక ప్రకారం కొన్ని పద్ధతులు ఆచరించాలని పండితులు చెబుతూ ఉంటారు. కొందరు ఎంత డబ్బు సంపాదించినా.. ఎన్నో ఆస్తులు ఉన్నా.. ఇంట్లో సుఖశాంతులు ఉండవు. నిత్యం గొడవలు, బాధలతో ఉంటారు. ఇంట్లో ఎప్పుడూ నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది. అయితే కొన్ని సాంప్రదాయాలు పాటించడం వల్ల మనసు ప్రశాంతంగా మారడంతో పాటు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని కొందరు వాస్తు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో ఆవు విగ్రహం లేదా, ఆవు దూడ కలిగిన చిత్రాన్ని ఉంచుకోవడం వల్ల దు:ఖాలు తొలిగిపోతాయని అంటున్నారు.
పురాణాల ప్రకారం సముంద్ర నుంచి ఉద్భవించిన 14 రత్నాల్లో కామధేనువు ఒకటి. ఆవులోనే దేవతలందరూ నివసిస్తారని చెబుతారు. శ్రీకృష్ణుడికి ఆవు అంటే ఎంతో ఇష్టం. అలాంటి ఆవు చిత్రం పటం లేదా ఆవి విగ్రహం ఇంట్ల ఉంటే ఎంతో మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఆవు చిత్ర పటాన్ని ఇంట్లో ఉంచుకోవాలనుకునేవారు దీనిని తూర్పు -ఆగ్నేయ దిశలో ఉంచాలి. ఇలా పెట్టడం వల్ల గొడవలు, దు:ఖాలు తొలగిపోతాయని అంటున్నారు.
అలాగే దూడకు పాలు ఇస్తున్న ఆవు విగ్రహాన్ని ఇంట్లోకి తెచ్చుకోవడం వల్ల ఎన్నో శుభాలు కలుగుతాయట. ఇలాంటి విగ్రహం ఇంట్లో ఉండే మంచి గుణమున్న పిల్లలు తయారవుతారు. కొత్తగా పెళ్లయిన వారు ఆవు దూడతో ఉన్న చిత్రపటాన్ని తమ పడకగదికి ఎదుగుగా ఉంచడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని చెబుతున్నారు. ఇల్లు లేదా భవనం నిర్మించుకున్న వారు ప్రత్యేక పూజలు చేసి గృహ ప్రవేశం చేస్తారు. ఈ సమయంలో ఆవుతో కలిసి గృహ ప్రవేశం చేయడం వల్ల ఎంతో మంచిదని అంటున్నారు.
మంచి ఉద్యోగం కావాలనుకునేవారు ఇంటర్వ్యూకు వెళ్లే ముందు ఆవుకు పచ్చ గడ్డి వేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు. ఏదైనా అవసరాలకు ఉన్నతాధికారులను కలిసే సమయంలోనూ ఇలా చేయడంతో సత్ఫలితాలు ఇస్తాయని చెబుతున్నారు. ఇంట్లోనే కాకుండా వ్యాపారాలు నిర్వహించే ప్రదేశాల్లో ఆవు చిత్రపటాన్ని ఉంచడం వల్ల మంచే జరుగుతుందని చెబుతున్నారు.