
FCI Recruitment 2021: పంజాబ్ లోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వాచ్‌మన్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 860 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. ఐదో తరగతి లేదా ఎనిమిదో తరగతి చదివిన అభ్యర్థులు ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://fci.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
నవంబర్ నెల 11వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉందని సమాచారం అందుతోంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. 2021 సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీ నాటికి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 23,000 రూపాయల నుంచి 64,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది.
రాత పరీక్ష, ఫిజికల్ ఎన్‌డ్యూరెన్స్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తారు. మొత్తం 120 మార్కులకు పరీక్ష జరగనుండగా ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున కేటాయిస్తారు. ప్రశ్నాపత్రం, పంజాబీ, హిందీతో పాటు ఇంగ్లీష్ లో ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 250 రూపాయలుగా ఉంది.
https://fci.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇతర వివరాలను కూడా తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక పరీక్షకు ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు.