Rajamouli And Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి పాన్ చేసిన సినిమా పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. రాజమౌళి గ్యాప్ వచ్చిన ప్రతిసారి ఈ సినిమా స్క్రిప్ట్ పైనే కూర్చుంటున్నాడు. అయితే, విజయేంద్ర ప్రసాద్ రాసిన కథ రాజమౌళికి నచ్చలేదు. ఇప్పటికే నాలుగు కథలు చెప్పాడు. ఏవీ జక్కన్నకు కనెక్ట్ కాలేదు. అలాగే మరో పది లైన్లు చెప్పాడు. వాటిలో ఏది రాజమౌళికి నచ్చలేదు.

దాంతో రాజమౌళి ఈ సినిమా విషయంలో మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ఏ సినిమా అయినా రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది ? అనే ఆలోచనలో ఉన్నాడట. అయితే, ఎప్పటి నుండో మహేష్ కోసం రాజమౌళి జేమ్స్ బాండ్ క్యారెక్టర్ లాంటి ఒక క్యారెక్టర్ అనుకున్నాడు. ఆ క్యారెక్టర్ ఆధారంగానే విజయేంద్ర ప్రసాద్ మూడు కథలు రాశాడు. అదేవిధంగా ఒక మొత్తం స్క్రిప్ట్ రాశాడు.
కానీ రాజమౌళికి ఏది నచ్చకపోవడంతో సీక్రెట్ ఏజెంట్ జోనర్ లో సాగే ఓ హాలీవుడ్ సినిమా రైట్స్ తీసుకుని.. ఆ సినిమా ఆధారంగా మరో కథ రాస్తే బాగుంటుందని విజయేంద్ర ప్రసాద్ కి సూచించాడట. ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ టీమ్ ఆ కథ పైనే వర్క్ చేస్తుంది. మరోపక్క ఎప్పటి నుంచి ఈ చిత్ర నిర్మాత కేఎల్ నారాయణ కూడా కథలు వింటున్నాడు.
తెలుగు రైటర్స్ మాత్రమే కాకుండా పక్క భాషల్లోని రైటర్స్ కూడా వచ్చి కథలు చెప్పారు. అయినా ఎవరి కథ ఫైనల్ కాలేదు. అయినా మైండ్ లో ఒకటి పెట్టుకుని మరో అంశం పై కథ వింటే ఎందుకు నచ్చుతుంది ? పైగా కథను ఓకే చేసేది రాజమౌళి. అసలు రాజమౌళికి ఏది అంత తేలిగ్గా నచ్చదు. అందుకే, టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక, చివరకు రీమేక్ వైపు రాజమౌళి చూపులు వెళ్లాయని తెలుస్తోంది. మహేష్ మాటేమిటి అనేది చూడాలి.
ఇక కథ సెట్ అయినా ఇప్పట్లో మహేష్ – రాజమౌళి సినిమా మొదలవుతుంది అని ఊహించలేం. వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత వీరి కలయికలో సినిమా స్టార్ట్ అవుతుంది. ఓ దశలో ఛత్రపతి శివాజీ చరిత్ర ఆధారంగా సినిమా చేస్తే బాగుంటుందని కూడా ఆలోచించారు. అయితే, ఛత్రపతి శివాజీ కథ అందరికీ తెలిసిందే. తెలిసిన కథతో భారీ అంచనాలను అందుకోవడం కష్టం. అందుకే ఆ ఆలోచనను విరమించుకున్నారు.