
WhatsApp Banking: మనలో చాలామంది సందేశాలను పంపడానికి, కాల్స్ మాట్లాడటానికి వాట్సాప్ యాప్ ను ఎక్కువగా వినియోగిస్తారు. అయితే వాట్సాప్ యాప్ ను ఉపయోగించి సులభంగా లోన్ పొందే అవకాశం కూడా ఉంది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా 10 లక్షల రూపాయల వరకు వాట్సాప్ ద్వారా లోన్ ను పొందవచ్చు. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలలో ఒకటైన ఇండియా ఇన్ఫోలిన్ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
కేవలం హాయ్ అని మెసేజ్ పెట్టడం ద్వారా సులభంగా డబ్బు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇండియా ఇన్ఫోలిన్ లోన్ అవసరమైన వ్యక్తులకు కేవలం కొన్ని నిమిషాలలోనే రుణాన్ని అందించనుండటం గమనార్హం. కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రుణాలను మంజూరు చేయడం జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగదారుని యొక్క దరఖాస్తు, కేవైసీ వివరాలతో పాటు బ్యాంక్ ఖాతాను ధృవీకరించడం జరుగుతుంది.
ఈ స్కీమ్ కింద లోన్ తీసుకోవాలని భావించే వాళ్లు కనీసం 10,000 రూపాయలు లోన్ తీసుకోవాలి. లోన్ పది నిమిషాల్లో ఆమోదం పొందనుండగా 24 గంటల్లో ఖాతాలో నగదు జమవుతుంది. ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్లు 5 సంవత్సరాలలో లోన్ ను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. 9019702184 నంబర్ కు హాయ్ అని మెసేజ్ పెట్టడం ద్వారా సులభంగా రుణాన్ని పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.
హాయ్ అని మెసేజ్ పెట్టిన తర్వాత పేరు, వ్యాపారం, ఇతర వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్రెడిట్ హిస్టరీని తనిఖీ చేసి రుణాన్ని మంజూరు చేయడం జరుగుతుంది. వన్ టైమ్ పాస్ వర్డ్ ద్వారా క్రెడిట్ హిస్టరీని ధృవీకరించి రుణ మొత్తాన్ని అందజేస్తారు. ఈ స్కీమ్ ద్వారా తీసుకున్న రుణానికి 24 శాతం వడ్డీ ఉంటుంది.