Jobs: ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగ ఖాళీలు భర్తీ కానున్నాయి. మొత్తం 98 ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఫిట్టర్, మెషినిస్ట్, ప్లంబర్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.

కనీసం 60 శాతం మార్కులతో ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. 23 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏడాది ట్రెయినింగ్ వ్యవధి కోసం ఉద్యోగులను ఎంపిక చేస్తారని సమాచారం.
Also Read: మచిలీపట్నం బెయిల్ లో ప్రాజెక్ట్ ఇంజనీర్ జాబ్స్.. భారీ వేతనంతో?
అకాడమిక్ లో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు నెలకు 7,000 రూపాయల వరకు వేతనం లభించనుంది. 2021 సంవత్సరం డిసెంబర్ 18వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుంది.
నిరుద్యోగులు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే https://fact.co.in/ వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది.
Also Read: సికింద్రాబాద్ రైల్వేలో 81 జూనియర్ ఇంజినీర్ జాబ్స్.. భారీ వేతనంతో?