https://oktelugu.com/

PM Ujjwala Yojana: ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ పొందాలనుకుంటున్నారా.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

PM Ujjwala Yojana: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో ఉజ్వల 2.0, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన స్కీమ్ కూడా ఒకటి. కేంద్రం ఈ స్కీమ్ ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లను అందజేస్తోంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఈ స్కీమ్ కింద ఇప్పటివరకు 8.8 కోట్ల గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేయడం గమనార్హం. ఈ స్కీమ్ కింద […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 7, 2021 / 08:48 AM IST
    Follow us on

    PM Ujjwala Yojana: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో ఉజ్వల 2.0, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన స్కీమ్ కూడా ఒకటి. కేంద్రం ఈ స్కీమ్ ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లను అందజేస్తోంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఈ స్కీమ్ కింద ఇప్పటివరకు 8.8 కోట్ల గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేయడం గమనార్హం.

    PM Ujjwala Yojana

    ఈ స్కీమ్ కింద కేంద్రం ప్రస్తుతం కోటి గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వాళ్లు ఫ్రీగా స్టవ్ తో పాటు గ్యాస్ సిలిండర్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం ఇవ్వడం ద్వారా వలస కార్మిక కుటుంబాలు సైతం ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ను సులభంగా పొందవచ్చు. ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే మొదట pmuy.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

    Also Read: తెలంగాణలో బీజేపీ సెల్ఫ్ గోల్ వేసుకుంటోందా?

    ఈ వెబ్ సైట్ ద్వారా సులభంగా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. మొదట వెబ్ సైట్ లో ‘కొత్త ఉజ్వల 2.0 కనెక్షన్ కోసం దరఖాస్తు’ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తరువాత ఇండేన్, భారత్ పెట్రోలియం మరియు హెచ్.పీ గ్యాస్ కంపెనీలలో ఒకదానిని ఎంపిక చేసుకోవచ్చు. మూడు కంపెనీలలో సౌలభ్యం ప్రకారం నచ్చిన కంపెనీని ఎంపిక చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

    ఆ తర్వాత అడిగిన సమాచారం మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తును ధృవీకరించిన తర్వాత ఎల్పీజీ కనెక్షన్ ను జారీ చేస్తారు. ఇప్పటివరకు ఎల్పీజీ కనెక్షన్ లేని వాళ్లు ఈ స్కీమ్ ద్వారా కొత్త గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    Also Read: భారత్ లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన కొత్త స్నేహానికి దారితీస్తుందా..?