Jio Phone 5g: దేశీయ టెలీకాం దిగ్గజం జియో వినియోగదారులకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. జియో కస్టమర్లకు ప్రయోజనం చేకూరే విధంగా త్వరలో 5జీ ఫోన్ ను అందుబాటులోకి తీసుకురానుంది. జియో 5జీ స్మార్ట్ ఫోన్ దిశగా అడుగులు వేస్తుండటంతో జియో కస్టమర్లు సంతోషిస్తున్నారు. ఈ ఏడాదే దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయని బోగట్టా.
జియో 5జీ ఫోన్ కు సంబంధించిన ఫీచర్లు లీక్ కాగా ఈ ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. మన దేశంలో ఈ 5జీ స్మార్ట్ ఫోన్ ధర 12,000 రూపాయల లోపు ఉండవచ్చని సమాచారం అందుతోంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ తో ఈ ఫోన్ అందుబాటులోకి రానుందని బోగట్టా. ఈ ఫోన్ లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
దేశంలో ఎక్కువ సంఖ్యలో వినియోగదారులు ఉన్న టెలీకాం కంపెనీలలో జియో ఒకటనే సంగతి తెలిసిందే. 1,600 x 720 పిక్సెల్ రిజల్యూషన్ తో ఈ ఫోన్ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటు 4 జీబీ ర్యామ్ ఈ ఫోన్ లో ఉంటుందని సమాచారం అందుతోంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ యూజర్లకు అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.
2022 సంవత్సరం చివరినాటికి ఈ ఫోన్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేయనుందని తెలుస్తోంది. 2 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్ అందుబాటులోకి రానుండటం గమనార్హం. ఇంటర్నెట్ ను ఎక్కువగా వినియోగించే వాళ్లకు 5జీ ఫోన్ వల్ల మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి.