Relationship: భార్య మనసు గెలవడం చాలా సులభం.. ఇవి ఫాలో అవండి చాలు..

ప్రతి భార్య కూడా తమ భర్త సపోర్ట్ ను చాలా విషయాల్లో కోరుకుంటుంది. కొన్ని సమయాల్లో ఆమె బాగా భాదపడుతుంటుంది. ఇంటిబాధ్యతలు, ఉద్యోగం వంటి బాధ్యతల్ని బాలెన్స్ చేయడం కొన్ని సార్లు కష్టంగా మారవచ్చు.

Written By: Swathi Chilukuri, Updated On : September 5, 2024 5:02 pm

Relationship

Follow us on

Relationship: భార్యాభర్తల అనుబంధం హ్యాపీగా ఉండాలంటే ఇద్దరి మధ్య అర్థవంతమైన కమ్యూనికేషన్ మస్ట్. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం ముఖ్యం. మరీ ముఖ్యంగా ముందుగానే ఎదుటివారు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో గుర్తించాలి. వాటిని తీర్చాలి. అప్పుడే ఆ రిలేషన్ హ్యాపీగా ఉంటుంది. ముఖ్యంగా రిలేషన్‌లో భార్యలు భర్తల దగ్గర్నుంచి కొన్ని బేసిక్ అవసరాలని ఎవరు అయినా సరే ఎక్స్ పెక్ట్ చేస్తుంటారు. వాటిని గనుక భర్త గుర్తించి ఫాలో అయితే ఆ భార్య సంతోషిస్తుంటుంది. అంతేకాదు వారి బంధం అన్యోన్య దాంపత్యంగానే కలకాలం మిగులుతుంది. మరి భార్యామణి ఎక్స్ పెక్ట్ చేసే అవేంటంటే..

ప్రతి భార్య కూడా తమ భర్త సపోర్ట్ ను చాలా విషయాల్లో కోరుకుంటుంది. కొన్ని సమయాల్లో ఆమె బాగా భాదపడుతుంటుంది. ఇంటిబాధ్యతలు, ఉద్యోగం వంటి బాధ్యతల్ని బాలెన్స్ చేయడం కొన్ని సార్లు కష్టంగా మారవచ్చు. అలాంటప్పుడు భర్త చొరవ తీసుకొని ఆమెకు సహాయం చేస్తుండాలి. భార్యతో కాసేపు టైమ్ స్పెండ్ చేసి కబుర్లు చెబుతూ ఇద్దరు ఫోన్ లేకుండా గడపాలి. తనకు ఉన్న పనులను పక్కన పెట్టి ఆమె కోసం సమయం ఇచ్చి ఇద్దరు కలిసి హాయిగా మాట్లాడుతుంటే ఆ భార్యకు కొండంత అండంగా అనిపిస్తుంది.

భార్యలు భర్తల నుంచి కేరింగ్ ను కచ్చితంగా ఎక్స్ పెక్ట్ చేస్తారు. వారి భర్త కచ్చితంగా తనని కేరింగ్‌ చూసుకోవాలి అనుకుంటారు. చిన్న చిన్న అవసరాలని గుర్తించాలి. అంటే తిన్నారా లేదా, ఆరోగ్యం ఎలా ఉందివంటి విషయాలు చాలు. అప్పుడప్పుడు గిఫ్ట్స్, సర్‌ప్రైజెస్ వంటివి ఇస్తే ఇక ఆమె సంతోషానికి అవధులు ఉండవు. కొన్ని హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి వాటిని గుర్తు పెట్టుకొని కేరింగ్‌గా చూసుకుంటే చాలు చాలా సంతోషిస్తుంది మీ భార్య.

రిలేషన్‌లో గౌరవం చాలా ముఖ్యం. భార్యలు ఇంట్లో ఎన్ని జరిగినా భరించినా సరే కానీ, వారి విషయాలు పదిమందిలో చెప్పి బాధపెడితే మాత్రం సహించలేరు. వేరే వారి ముందు వారిని తక్కువ చేస్తే అస్సలు తట్టుకోలేరు. వారిని కచ్చితంగా గౌరవించాల్సిందే. ఇదే భార్యలు భర్తల నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తారు.

ఒకసారి పెల్లి అయితే ప్రతి భర్త కూడా ఏ విషయాన్నైనా తమ దగ్గర నిజాయితీగానే ఉండాలని ప్రతి ఒక్కరి భార్య కోరుకుంటుంది. తమ రిలేషన్‌లో ఎలాంటి దాపరికాలు ఉండవద్దు అనుకుంటుంది. వారి భర్తలు ఏ విషయాలని కూడా తమ దగ్గర దాచవద్దని అనుకుంటారు. ఎలాంటి విషయం అయినా సరే మీ భార్య వద్ద దాచకుండా చెప్పేయండి.

భర్తలు తమను అర్థం చేసుకోవాలని భార్యలు కోరుకుంటారు. ఆమె ఇష్టఅయిష్టాలు, అవసరాలు, కోరికలు వంటివి కొన్ని చెప్పకముందే అర్థం చేసుకోవాలి అనుకుంటారు. కొన్ని చెప్పిన తర్వాత తీర్చడం కంటే చెప్పకుండా తీరిస్తేనే కిక్ ఉంటుంది. ఆనందం ఉంటుంది.. ఎవరైతే ఈ విషయాలని ముందుగానే గ్రహిస్తారో వారి జీవితం పూలపాన్పే. మరి ఆలోచించండి. మీ బజీ లైఫ్ లో కాస్త సమయం తనకు ఇచ్చి జీవితాన్ని అందంగా మలుచుకోండి.