https://oktelugu.com/

Periods: పీరియడ్స్ సరిగ్గా రావడం లేదా? అయితే ఇదిగో పరిష్కారం..

మందుల దాకా వెళ్లకముందు.. మన లైఫ్ స్టైల్ ని మార్చుకోవడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకుంటూ... కొన్ని రకాల టీలు తాగడం వల్ల కూడా పీరియడ్స్ రెగ్యూలర్ గా వస్తాయి అంటున్నారు నిపుణులు. మరి ఎలాంటి టీలు తాగాలి అనే వివరాలు ఇప్పుడు చూసేద్దాం.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 5, 2024 5:07 pm
    Periods Delay Reason

    Periods Delay Reason

    Follow us on

    Periods: తల్లి కావాలి అనుకునేవారికి పీరియడ్స్ మిస్ అయితే సంతోషంగా ఫీల్ అవుతారు కదా.. అలా కాకుండా.. పీరియడ్స్ సరిగా రాలేదు అంటే మాత్రం కంగారు పడాల్సిందే. ఎందుకంటే… పీరియడ్స్ క్రమం తప్పకుండా రావడం లేదంటే వారికి పీసీఓడీ, పీసీఓఎస్ సమస్యలు ఉన్నాయి అంటారు వైద్యులు.ఈ సమస్య పెరగకముందే జాగ్రత్త పడాలి. లేదంటే సమస్యలు వచ్చేస్తాయి. పీరియడ్స్ మిస్ అవ్వడం ఎన్నో కారణాల మీద ఆధారపడి ఉంటుంది. మోనోపాజ్, శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, ధూమపానం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వంటి కారణాల వల్ల పీరియడ్స్ ఆలస్యంగా రావచ్చు.

    మందుల దాకా వెళ్లకముందు.. మన లైఫ్ స్టైల్ ని మార్చుకోవడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకుంటూ… కొన్ని రకాల టీలు తాగడం వల్ల కూడా పీరియడ్స్ రెగ్యూలర్ గా వస్తాయి అంటున్నారు నిపుణులు. మరి ఎలాంటి టీలు తాగాలి అనే వివరాలు ఇప్పుడు చూసేద్దాం.

    1.మెంతులు… మెంతుల వాటర్ రెగ్యులర్ గా తాగితే… హార్మోన్ల అసమతుల్యతను కంట్రోల్ చేయవచ్చు. మెంతుల్లో ఫైటో ఈస్ట్రోజెన్ ఉంటుంది. ఇది.. పీరియడ్స్ ని క్రమబద్దీకరణం చేస్తుంది.

    2. జీలకర్ర: పీరియడ్స్ సమస్యను తగ్గించడంలో చాలా సహాయం చేస్తుంది జీలకర్ర.

    3. కుంకుమపువ్వు: రుతుక్రమంలో వచ్చే నొప్పి , అసౌకర్యాన్ని తగ్గించి మీకు హాయిని ఇస్తుంది కుంకుమ పువ్వు.

    4. కొత్తిమీర గింజలు: ధనియాల నీటిని తీసుకోవడం వల్ల పీరియడ్ నొప్పి తగ్తుతుంది.

    5. బెల్లం: రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి సహాయం చేస్తుంది బెల్లం.
    టీ తయారీ విధానం:
    పీరియడ్స్ రెగ్యూలర్ గా రావడానికి ఈ టీని తయారు చేయడం కూడా సులభమే. ఒక పాన్ తీసుకుని అందులో 2-3 తంతువుల కుంకుమపువ్వు, 1 స్పూన్ మెంతి గింజలు, 1 స్పూన్ కొత్తిమీర గింజలు, 1 టీస్పూన్ జీరాలు వేసి అందులోనే ముందుగా 200ml నీరు తీసుకోవాలి. అన్ని వేసి మరిగిస్తున్నప్పుడు వాటర్ సగం అయితే అందులో 1 స్పూన్ బెల్లం వేయండి. అంతే మీసూపర్ టీ రెడీ.

    మరిన్ని డైట్, లైఫ్‌స్టైల్ చిట్కాలు:

    1. ఉదయాన్నే లేవాలి. సూర్యకాంతి మీ కార్టిసాల్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. అందుకే ఉదయం లేవడం అలవాటు చేసుకోవాలి.
    2. పీరియడ్ హెల్త్ డ్రింక్ మీ పీరియడ్ డేట్‌కు 2-3 రోజుల ముందు తాగడం వల్ల ఫలితం ఉంటుంది.
    3. ప్రొటీన్-రిచ్ డైట్ మీ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.
    4. ఋతు ప్రవాహాన్ని మెరుగుపరచడానికి వారానికి 3-4 సార్లు పీరియడ్స్ వ్యాయామాలు చేయండి. వీటి కోసం స్పెషల్ వ్యాయామాలు కూడా ఉంటాయి.
    5. ప్రాసెస్ చేసిన ఆహారాలు, శుద్ధి చేసిన చక్కెరలను తినవద్దు. ఇవి మీ హార్మోన్లకు అంతరాయం కలిగిస్తాయి.
    6. భోజన సమయాలు డిటాక్సిఫికేషన్‌లో సహాయం చేస్తాయి. కాబట్టి రాత్రి భోజనం , అల్పాహారం మధ్య 12-14 గంటల గ్యాప్ ఉండేలా చూసుకోవడం బెటర్.
    7. 8 గంటలు నిద్రపోవాలి. నిద్రించడానికి గంట ముందు స్క్రీన్‌లను చూడవద్దు. నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి పడుకునే ముందు యోగ చేసి పడుకోవాలి.
    8. డ్రై ఫ్రూట్ తీసుకోవడం మంచిది. నానపెట్టిన డ్రై ఫ్రూట్స్ ని.. రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల పీరియడ్స్ సమస్య తగ్గుతుంది.