
Copper Vessel: ఈ మధ్య కాలంలో వైద్య నిపుణులు రాగి పాత్రలో నీళ్లు తాగితే మంచిదని సూచిస్తున్నారు. అందువల్ల రాగిపాత్రలో నీళ్లు తాగేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాగి పాత్రలోని నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తొలగిపోవడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. రాగి పాత్రలోని నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గే అవకాశం కూడా ఉంది. కాలేయం, కిడ్నీల పనితీరును మెరుగుపరచడంలో రాగిపాత్రలోని నీళ్లు తోడ్పడతాయి.
అయితే కొన్ని పదార్థాలను మాత్రం రాగి పాత్రల(Copper Vessel) ద్వారా అస్సలు తీసుకోకూడదు. రాగి పాత్రలో కొన్ని పదార్థాలను ఉంచడం వల్ల శరీరానికి హాని జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శరీరానికి నిమ్మరసం తాగడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. అయితే రాగి పాత్రలో నిమ్మరసం తాగితే శరీరానికి హాని కలుగుతుంది. నిమ్మకాయలో ఉండే యాసిడ్ రాగితో వేగంగా స్పందించే గుణాన్ని కలిగి ఉంటుంది.
రాగిపాత్రలో నిమ్మరసం తీసుకుంటే కడుపునొప్పి, గ్యాస్ సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. రాగి పాత్రలో ఊరగాయలను సైతం అస్సలు ఉంచకూడదు. ఊరగాయలను, పుల్లని పదార్థాలను రాగి పాత్రలలో ఉంచకూడదు. శరీరానికి లస్సీ, మజ్జిగ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే వీటిని కూడా రాగిపాత్రలో ఉంచి తీసుకోకూడదు. పాలు లేదా పాలతో తయారు చేసిన ఉత్పత్తులను రాగి పాత్రలో ఉంచకూడదు.
పాలు, పాల ఉత్పత్తులను తాగిపాత్రలో ఉంచి తీసుకుంటే ఆరోగ్యంపై చెడు ప్రభావం పడే అవకాశం అయితే ఉంటుంది. పాలు, పెరుగు, జున్ను రాగిపాత్రలలో ఉంచితే అవి విషంగా మారే ఛాన్స్ కూడా ఉంటుంది. రాగిపాత్రలను ఎక్కువగా వినియోగించే వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.