
Telugu Actress: జనరేషన్ మారిపోతుంది. మారుతున్న తరానికి అనుగుణంగా అన్నిటికీ మించి నేటి కాలానికి తగ్గట్టుగా వస్త్రధారణ కూడా మారిపోయింది. మా రోజుల్లో గోచి పెట్టుకుని తిరిగేవారు అని ఇప్పుడు చెబితే జనాలు ఛీ కొడతారు. అందుకే, సాధారణ జీవితాల్లో కూడా గ్లామర్ షో అలవాటు అయిపోయింది. సహజంగా గ్లామర్ ఫీల్డ్ లోని ఆడవాళ్లకే హద్దులు మీరిన వస్త్రదారణ ఉంటుంది. అందుకే, సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల వస్త్రధారణ ఎప్పుడూ ప్రత్యేకమే.
అయితే, ఒక్కోసారి ముదురు భామలు కూడా హాట్ గా కనిపించడానికి తమ పరిధి దాటుతూ ఉంటారు. ఎలాగూ సినిమా అనేది కోట్ల వ్యాపారం, కాబట్టి.. సినిమాల్లో పాత్రను బట్టి కొంత గ్లామర్ షో అనేది తప్పనిసరి అయిపోయింది. కానీ నిజ జీవితంలో కూడా అలా కనిపిస్తే పద్దతి అనిపించుకోదు. పైగా వయసు అయిపోయాక అలా కనిపించాల్సిన అవసరం ఏముంది ?
కానీ కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు మాత్రం సందర్భం ఏదైనా.. స్థలం ఎక్కడైనా తమ పద్దతి మాత్రం మారదు అంటున్నారు. ఓ తెలుగు నటి(Telugu Actress).. కొంతకాలం క్రితం భర్తను కోల్పోయింది. మళ్ళీ పెళ్లి చేసుకోబోతుంది అని ఎప్పటి నుంచో రూమర్స్ వస్తున్నాయి. ఆమెకు ఒక కుమార్తె కూడా ఉంది. తన కూతుర్ని కూడా తన దారిలోనే ఆ మాటకొస్తే.. తనకంటే ఎక్కువగానే గ్లామర్ ప్రపంచంలోకి తీసుకొచ్చింది.
అయితే, ఆ నటి నిన్న దసరా సందర్భంగా హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలోని సాయిబాబా గుడికి వెళ్ళింది. అయితే గుడికి వెళ్లినా.. ఆమె తన వస్త్రధారణ విషయంలో మాత్రం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. ఎప్పటిలాగే తనకి ఇష్టమైన దుస్తులు ధరించి గుడికి వెళ్ళింది. అయితే చాలామంది మహిళలు కూడా గుడికి వెళ్లారు.
అక్కడ ఈ నటి తనకు అలవాటైన రీతిలో స్లీవ్ లెస్ టాప్ ధరించి క్లీవేజ్ అందాలను ధారపోయడం చూసిన సదరు మహిళలు ఆమె పై విరుచుకు పడ్డారు. మొత్తానికి అక్కడ చిన్నపాటి గొడవ జరిగింది. నీకు తగ్గట్టుగా డ్రెస్ ఎక్కడైనా వేసుకో, గుడిలో మాత్రం నీ తాళం మార్చుకోమని అక్కడ పెద్దలు కూడా ఆమెకు సున్నితంగా చెప్పారు. సలు గుడిలో కూడా అందాల ప్రదర్శన అవసరమా ? ఏదేమైనా ఇలాంటి ప్రదర్శనలు వల్ల గౌరవం పోతుందనే విషయం ఆ నటికి తెలియకపోవడం విడ్డూరమే. అ