https://oktelugu.com/

Chanakya Neeti : చాణక్య నీతి: ఇలాంటి వ్యక్తులతో స్నేహం చేయడం చాలా డేంజర్.. ఎందుకంటే?

కొత్త స్నేహం చేసేవారు ఎదుటి వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారు కొన్ని లక్షణాలను కలిగి ఉంటే వారికి దూరంగా ఉండడమే మంచిదని చాణక్య నీతి చెబుతుంది. అయితే ఎలాంటి లక్షణాలు ఉన్నవారికి దూరంగా ఉండాలంటే?

Written By:
  • Srinivas
  • , Updated On : November 6, 2024 / 02:08 AM IST

    Chanakya Neeti

    Follow us on

    Chanakya Neeti :  అపర చాణక్యుడు తన మేథా సంపత్తిని ప్రజలకు అందించాడు. రాజకీయంగానే కాకుండా మనుషుల జీవితాలకు సంబంధించిన కొన్ని విలువైన సూత్రాలను చెప్పాడు. ప్రతీ వ్యక్తికి కుటుంబంతో పాటు స్నేహితులు కూడా ఉంటారు. అయితే కొందరికి మంచి స్నేహితులు ఉంటారు.మరికొందరికి చెడ్డ స్నేహితులు ఉంటాయి. స్నేహం చేసే ముందే ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని వారితో స్నేహం చేయాలని చాణక్య నీతి చెబుతుంది. ఎక్కువగా స్నేహం చేసేవారు తమ స్నేహితులను బట్టే తమ జీవితం ఉంటుందని అంటారు. జీవితంలో పాత స్నేహితులతో పాటు కొత్త స్నేహాలు కూడా పుడుతాయి. అయితే కొత్త స్నేహం చేసేవారు ఎదుటి వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారు కొన్ని లక్షణాలను కలిగి ఉంటే వారికి దూరంగా ఉండడమే మంచిదని చాణక్య నీతి చెబుతుంది. అయితే ఎలాంటి లక్షణాలు ఉన్నవారికి దూరంగా ఉండాలంటే?

    డబ్బంటే ప్రీతి లేనివారు ఎవరూ ఉండరు. ప్రతి ఒక్కరికి డబ్బు అవసరమే. కానీ డబ్బే జీవితం కాదని చాణక్య నీతి చెబుతుంది. అంటే డబ్బునేప్రధానంగా చేస్తూ స్నేహం చేసేవారు ఉంటారు. అంటే ఒక వ్యక్తి వద్ద డబ్బు ఉంటేనే స్నేహం చేయడానికి ముందుకు వస్తారు. డబ్బు కోల్పోయినప్పుడు వారు పట్టించుకోరు. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలని చాణక్యులు చెప్పారు. డబ్బు గురించి మాట్లాడేవారు.. డబ్బు కోసమే పనిచేసే వారితో స్నేహం చేయకుండా ఉండాలని చెబుతారు.

    కొందరు తాము పట్టిక కుందేళ్లకు మూడే కాళ్లు అంటారు. అంటే తనదే గొప్ప అని వాదిస్తూ ఉంటారు. తమ మాట వినని వారిని అవసరమైతే నష్టం చేయడానికి కూడా వినరు. అలాంటి వారు స్నేహితులపై కూడా పెత్తనం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి వారితో స్నేహం చేయడం వల్ల మనశ్శాంతి కరువవుతుంది. ఇలాంటి వారి గురించి ముందే తెలవడం వల్ల వారితో దూరంగా ఉండడమే మంచిది. వీరి వల్ల ఎప్పుడూ ఇబ్బందులే ఎదుర్కొంటూ.. ఇబ్బందిపడుతూ ఉంటారు. ఇలాంటి వారితో స్నేహం చేయడం వల్ల నష్టమే కలుగుతుంది.

    జీవితం కష్టసుఖాలమయం. అయినంత మాత్రాన కష్టాన్ని మాత్రమే తలుచుకుంటే సంతోషంగా ఉండలేదు. అయితే కొందరు వ్యక్తులు మాత్రం ఎప్పుడూ విచారంగా ఉంటారు. ఏదో కోల్పోయిన విధంగా బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులతో స్నేహం చేయడం వల్ల సంతోషం ఉన్న వారు కూడా బాధపడుతూ ఉంటారు. అందువల్ల విచారం ఎదుర్కొంటున్న వారికి దూరంగా ఉండడమే మంచిది. వీరు తాము మాత్రమే కాకుండా ఎదుటి వాళ్లను కూడా బాధపడుతారు. అంతేకాకుండా వీరితో స్నేహం చేయడం వల్ల ఎప్పుడూ కష్టాలను ఎదుర్కొంటారు.

    స్నేహం అనేది ఎవరైనా చేయొచ్చు. మగవాళ్లు మాత్రమే కాకుండా ఆడ, మగ మధ్య కూడా స్నేహం ఉంటుంది. అయితే కొందరు పైకి స్నేహం చేస్తూనే లోపల మరోలా ఆలోచిస్తూ ఉంటారు. బంధాలు, బంధుత్వాలకు ఎక్కువగా విలువ ఇవ్వకుండా ఉంటారు. ఇలాంటి వారితో స్నేహం చేయడానికి ముందుకు రాకుండా ఉండడమే మంచిది. వీరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చాణక్యుడు చెబుతున్నారు.