Parenting Tips: తల్లిదండ్రులు కాబోతున్నారంటే ఆ సంతోషం నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది కదా. ఇక ఈ పట్టరాని సంతోషంలో నెలలు నిండుతున్న కొద్ది పిల్లల కోసం ఏవేవో వస్తువులు కొని పెడుతుంటారు. కానీ ఇలా చేయకూడదు అంటారు పెద్దలు. ఇలా చేయడం వల్ల వస్తువులు వృధా. ముఖ్యంగా డబ్బు కూడా వృధానే అవుతుంది. మరీ అనవసరంగా కొనే వస్తువుల చిట్టా ఏంటో ఓ సారి చూసేద్దామా?
బిడ్డకు పాలు పట్టాలని నాలుగైదు బాటిల్స్ ను ఇతర ఇతర సైజ్ లలో కొని పెడుతుంటారు. పిల్లలు పుట్టాక మీకు అవసరం అయిన సైజ్ ను వెంటనే తెచ్చుకోవచ్చు. ముందే ప్లాస్టిక్ డబ్బాలు సో కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా. ఇలా నాలుగు అయిదు కొనడం వల్ల డబ్బు కూడా వృధా అవుతుంది. ఇక బాత్ టబ్స్ ను కొనుగోలు చేస్తారు. ఇంట్లో ఉండే టబ్బులను కూడా పిల్లల స్నానాలకు వాడవచ్చు. మీకు సౌకర్యంగా ఉన్న వాటిని పిల్లలు పుట్టాకనే తీసుకోవాలి. ఎందుకంటే వెంటనే టబ్ లో కూర్చోబెట్టి పిల్లలకు స్నానం చేయించరు.
డైపర్ బ్యాగులను కూడా కొంటారు. ఇంట్లోనే కదా ఉండేది. చంటి పిల్లలను తీసుకొని ఎక్కడికి వెళ్లరు. సో మీ హ్యాండ్ బ్యాగ్ లో కూడా క్యారీ చేయవచ్చు. మీ పిల్లలకు సంబంధించిన వస్తువులను కూడా పెట్టవచ్చు. ఇక బ్యూటీ రొటీన్ అవసరం లేదు. వారికి కావాల్సింది కేవలం సబ్బు, షాంపూ, ఆయిల్, నార్మల్ గా డ్రెస్ లు. ఇవి కొన్ని సార్లు హాస్పిటల్స్ వారు అందిస్తారు. లేదంటే మీ డాక్టర్ అడ్వైస్ చేస్తారు. తెలిసి తెలియక లోషన్స్ , వారిని ఇబ్బంది పెట్టే క్రీమ్స్ ను కొని డబ్బు వృధా చేసుకోకండి.
బొమ్మలను కూడా కొంటారు. పిల్లలు పుట్టాక చూడటానికి వచ్చే వారు తెస్తారు. వాటిని చూసి మీ దగ్గర లేనివి కొనడం బెటర్. బేబీ బంపర్స్, దుప్పట్లు కూడా వారి అవసరాలను బట్టి కొనుగోలు చేయండి. పుట్టగానే బిడ్డకు తల్లి ఒడి కంటే మిగిలినవి ఏవి కూడా సౌకర్యాన్ని అందించవు. ఇక పిల్లలకు ఊయల మాత్రం కొనండి. కొనేముందు ఓ సంవత్సరం పిల్లలు కూడా అందులో పడుకునేలా కొనేసేయండి. పెరుగుతున్న కొద్ది ఊయల సైజ్ ను పెంచేలా కొనకండి. డబ్బు వృధా చేసుకోకండి.