Beauty Tips: మొటిమలు, మచ్చలు లేని ముఖం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. పింపుల్ ఫ్రీ ఫేస్ కావాలని ఎన్నో కలలు కంటారు, ఎన్నో ఉత్పత్తులను వాడుతుంటారు. వాటి కోసం చాలా ఖర్చు కూడా చేస్తారు. అయినా ఫలితం శూన్యమే. కాని ఇలాంటి వాటికి వంటిల్లే బెస్ట్ సొల్యూషన్. కాస్త కరెక్ట్ గా ఉపయోగిస్తే చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. మీరు కూడా మీ చర్మాన్ని మెరిసేలా చేసుకోవాలి అనుకుంటున్నారా. పింపుల్స్ లేకుండా రీఫ్రెష్ గా ఉండేలా చేయాలంటే ఓ ప్యాక్ వేసుకుంటే సరిపోతుంది. మరి ఆ ప్యాక్ ఏంటో చూసేయండి.
రాత్రిపూట పడుకునే ముందు ఈ ప్యాక్ వేసుకోవాలి. దీని వల్ల మంచి రిజల్ట్స్ మీ సొంతం అవుతాయి. మరీ ముఖ్యంగా మేకప్ క్లీన్ చేసుకుని ఎక్స్ ఫోలియేట్ చేసుకుని ఈ మాస్క్ వేసుకోండి. దానికోసం పసుపును తీసుకోవాలి. ఈ పసుపు మంచి టోనర్ లా ఉపయోగపడుతుంది. పసుపు వల్ల చర్మ కాంతి వస్తుంది. మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, కర్కుమిన్ చర్మాన్ని కాంతివంతంగా మార్చేలా చేస్తాయి.
పసుపు వల్ల చర్మం మంట తగ్గడమే కాదు చర్మం యవ్వనంగా కూడా కనిపిస్తుంది. ఇక పసుపు మాదిరి రోజ్ వాటర్ కూడా మంచి టోనర్ లాగా ఉపయోగించవచ్చు. దీని వల్ల కూడా చర్మం మెరుస్తుంది. రోజ్ వాటర్ లో యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి. దీన్ని రాత్రిపూట రాస్తే చర్మం క్లీన్ అవుతుంది. నల్ల వలయాలు కూడా మాయం అవుతాయి. ఇక అలోవెరా స్కిన్ కు కావాల్సిన హైడ్రేషన్ ను ఇస్తుంది. పొడి చర్మం తగ్గి మొటిమలు మాయం అవుతాయి. చర్మ సమస్యల్ని దూరం చేయడంలో అలోవెరా ముఖ్య పాత్ర వహిస్తుంది.
ముందుగా 2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ ను ఓ కప్పులో తీసుకొని అందులో పావు టీ స్పూన్ పసుపు, అర కప్పు రోజ్ వాటర్ వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి గాలి పోని కంటెయినర్ లో పెట్టి ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోండి. దీన్ని రోజు రాత్రి పడుకునే ముందు చర్మంపై రాస్తే చాలు మచ్చలు, ముడతలు తగ్గి స్కిన్ మెరుస్తుంది.