Income : నేటి కాలంలో డబ్బు సంపాదించడం చాలా కష్టంగా మారింది. ఎందుకంటే సమాజంలో పోటీ పెరగడంతో ఉద్యోగాలు సాధించడం కత్తి మీద సాములా మారింది. అయితే ఏదో అలా ఉద్యోగం సంపాదించి జీవితాన్ని నడిపించాలని అనుకున్న సమయంలో ఖర్చులు తడిసి మోపెడ్ అవుతున్నాయి. రోజురోజుకు ధరలు పెరగడంతో ఖర్చులు పెరుగుతున్నాయి. కానీ ఆదాయం పెరగడం లేదు. దీంతో వచ్చిన ఆదాయమంతా ఖర్చులకే సరిపోతుంది. ఈ క్రమంలో పొదుపు అనేది చాలామందికి సాధ్యం కావడం లేదు. ఇలాంటి సమయంలో ఏదైనా అత్యవసరం ఏర్పడితే అప్పుడు చేయాల్సి వస్తుంది. మళ్లీ ఆ అప్పులు తీర్చడానికి మరో అప్పు చేయాల్సి వస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? తక్కువ ఆదాయం ఉన్నవారు ఎలాంటి ఖర్చులు చేసుకోవాలి? కొంతమంది నిపుణులు తెలుపుతున్న ప్రకారం.. ఇలాంటి ప్రణాళిక ద్వారా ఆర్థిక స్థిరత్వం ఉంటుందని అంటున్నారు. అవేంటంటే?
తక్కువ ఆదాయం వచ్చేవారు తక్కువ ఖర్చులు చేయాలని అంటున్నారు. అయితే రోజువారి జీవితంలో కొన్ని ఖర్చులు తప్పనిసరిగా ఉంటాయి. వాటనీ వద్దనుకుంటే జీవితం నడవదు. మరి ఎలాంటి ఖర్చులను తగ్గించుకోవాలి? వీటిలో.
Also Read : కూర్చుంటే డబ్బులు రావాలా? ఈ 5 సింపుల్ ట్రిక్స్ తెలుసుకోండి!
కార్డుకు బదులు క్యాష్ వాడండి:
ప్రస్తుత కాలంలో చాలామంది వద్ద క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఇవి ఒకటికి మించి ఉన్నాయి. అయితే క్రెడిట్ కార్డులు తక్షణ సాయం చేస్తాయి. కానీ వీటిని అత్యవసరానికి మాత్రమే వాడుకోవాలని విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అంతేకాకుండా సాధ్యమైనంతవరకు క్యాష్ తోని ఆర్థిక వ్యవహారాలు జరపాలి. ఇలా చేయడం వల్ల ఎన్ని ఖర్చులు పెడుతున్నాం? అనేది తెలుస్తుంది. దీంతో కొన్ని అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఫలితంగా ఆదాయం పెరుగుతుంది.
నో Paying డే:
రోజువారి ఏదో ఒక ఖర్చు ఉంటుంది. అయితే వీటిలో దుబారా ఖర్చులు కూడా ఉంటాయి. అలాంటప్పుడు సరదాలు తీర్చుకోవడం కూడా అవసరమే. అయితే ఆ సరదాలకు ఒకరోజు మాత్రమే కేటాయించండి. మిగతా రోజులను దుబార ఖర్చులకు దూరంగా ఉండండి. ఇలా కొన్ని రోజులపాటు నో పేయింగ్ డే గా మార్చుకోవాలి. దీంతో దుబారా ఖర్చులను తగ్గించుకోవచ్చు.
ఆఫర్స్ పై ఆలోచన:
ఒక్కోసారి కొన్ని వస్తువులపై ఆఫర్స్ వస్తూ ఉంటాయి. అయితే తక్కువ ధరకు వస్తుందని వాటిని కొనుగోలు చేస్తారు. ఆ వస్తువు అవసరం లేకున్నా దానిని కొనుగోలు చేయడం వల్ల ప్రస్తుత ఆదాయం తగ్గిపోతుంది. దీంతో అత్యవసర ఖర్చులకు ఆదాయం కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. అయితే ఆ వస్తువు భవిష్యత్తులో కచ్చితంగా ఉపయోగపడుతుంది అని అనుకుంటే మాత్రమే ఆఫర్స్ గురించి ఆలోచించాలి. లేకుంటే వాటిని పట్టించుకోకుండా ఉండడమే మంచిది.
ఎక్కువగా సబ్స్క్రిప్షన్లు వద్దు:
వినోదం కోసం కొన్ని సబ్స్క్రిప్షన్ లో చేయాల్సి వస్తుంది. అయితే ఎంత అవసరమో వాటిని మాత్రమే కొనుగోలు చేయాలి. అనవసరంగా కొనుగోలు చేసి డబ్బులు వృధా చేయవద్దు. వీటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటంవల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది.
ఇవే కాకుండా బయట ఫుడ్ nu తగ్గించి సాధ్యమైనంతవరకు ఇంట్లోనే తినే ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం వల్ల చాలా వరకు ఆదాయాన్ని మిగిలించుకోవచ్చు.