Relationship : రిలేషన్ ను మెయింటెన్ చేయడం చాలా కష్టం. కాస్త నెగటివ్ గా అనిపించినా సరే రిలేషన్ బ్రేక్ అవుతుంది. మరీ ముఖ్యంగా రిలేషన్ లో నమ్మకం చాలా అవసరం. నమ్మకం ఉంటే సంబంధాన్ని బలోపేతం చేయడానికి వ్యక్తులు తమ భాగస్వామి నుండి ఏదికూడా దాచరు. అయితే కొన్ని రిలేషన్ లలో మాత్రం దాచకుండా ఉన్నా సరే అనుమానం మాత్రం కొన్ని సార్లు మనుషులను వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి సమయంలో తమ భాగస్వామి ఫోన్‌లో రహస్యాలను చూడాలనే తాపత్రయం ఎక్కువ ఉంటుంది. ఏమైనా చిన్న అనుమానంగా కనిపించినా సరే ఎక్కువ బాధపడతారు. దీంతో భాగస్వామితో గొడవ పడతారు. నేరం చేసినట్టు పరిగణిస్తారు. కానీ అలా చేయడం తప్పు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే, దీని వల్ల మీ సంబంధాన్ని పాడు అవుతుంది. అయితే మీ పార్టనర్ మీ ఫోన్ ను చూడాలని? అందులోని రహస్యాలను తెలుసుకోవాలనే అనుకుంటున్నారా? వారికి మీ మీద ఉన్న ఈ అనుమానం పోవాలంటే మీరు ఏం చేయాలంటే?
ముందుగా మొబైల్ ను వారు ఎందుకు తనిఖీ చేయాలి అనుకుంటారు? వారికి ఎలాంటి వివరాలు కావాలి? ఎలాంటి అనుమానాలు ఉన్నాయి అని తెలుసుకోండి. ముందుగా మీ భాగస్వామి మీ ఫోన్‌లో ఏమి చూస్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. వారు మీ ఫోన్ కాల్ హిస్టరీ, చాటింగ్, సోషల్ మీడియా ఖాతాలను రహస్యంగా చూస్తుంటే మీ మీద అనుమానం ఉన్నట్టు. మీరు ఎలాంటి తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరం లేదు. కానీ రిలేషన్ ను కాపాడుకునే బాధ్యత ఉంటుంది కాబట్టి.
మీ ఇద్దరి మద్య సమయం లేకపోవడం వల్లే ఇలాంటివి ఎక్కువ జరుగుతుంటుంది. అందుకే కాస్త మీ భాగస్వామికి సమయం ఇవ్వాలి అంటున్నారు నిపుణులు. ఆఫీసు పనుల్లో బిజీగా ఉండడం వల్ల జీవిత భాగస్వామికి తగినంత సమయం ఇవ్వరు. అలాంటప్పుడు నెక్ట్స్ వారికి అనుమానం అనే బీజం మొదలు అవుతుంది.అందుకే మీరు మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపాలి. మీరు ఎందుకు సమయం ఇవ్వలేకపోతున్నారో కాస్త వారికి అర్థం అయ్యేట్టుగా చెప్పాలి.
అబద్ధాలు చెప్పే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. భాగస్వామి ఉన్నప్పుడు ఏదైనా ఫోన్ వస్తే రహస్యం ఉన్నట్టు బయటకు వెళ్తుంటారు. మీ పని ఏదైనా సరే ఇలా బయటకు వెళ్లి మాట్లాడటం వల్ల వెంటనే అనుమానం వస్తుంది. మీకు ఎలాంటి ఇబ్బంది లేకపోతే ఇంట్లోనే ఫోన్ మాట్లాడండి. లేదంటే ఆఫీస్ విషయాలు లేదా ఏమైనా ఇతర విషయాలు అయితే సీక్రెట్ రిలేషన్ మెయింటెన్ చేస్తున్నట్టుగా వారికి అనుమానం రాకుండా ఏదో పని గురించి మాట్లాడుతున్నారు అని నమ్మకం కలిగేలా చేసి ఆ తర్వాత బయటకు వెళ్లి మాట్లాడండి. కానీ భాగస్వామి వద్ద దాయాల్సిన విషయాలు మాత్రం ఏది ఉండదు అని గుర్తు పెట్టుకోండి.
దూరాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. పనిలో బిజీగా ఉండటం వల్ల, వ్యక్తులు తరచుగా తమ భాగస్వామిని మరచిపోతుంటారు. అందుకే ఎదురుచూస్తున్న మీ భాగస్వామికి మీరే కాల్ చేసి, వారితో కమ్యూనికేట్ చేయండి. సంతోషిస్తారు. కమ్యూనికేషన్ దూరాన్ని తగ్గిస్తుంది. మీరు ఎలాంటి తప్పు చేయడం లేదనే నమ్మకం కలిగేలా చేయండి. దీని వల్ల మీ ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉంటారు.